ASF: కౌటాల మండలం పాత కన్నెపల్లి వాడలో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులను సర్పంచ్ మోర్లే పార్వతి పరిష్కరించారు. సర్పంచ్ ఆదేశాల మేరకు ఆదివారం ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చారు. మిషన్ భగీరథ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులతో మాట్లాడుతున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆమె తెలిపారు.
BHNG: రామస్వామి తండాలో శ్రీ వీరన్న భద్రకాళి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ దిరావత్ సునీత వెంకటేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సమీప గ్రామాల సర్పంచులు తిరుమణి నాగరాజుగౌడ్, చెలివేరు పావని ఇంద్రసేనారెడ్డి, మాజీ MPTC మచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
CTR: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వేతనాల పెంపు, ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపు, 5G స్మార్ట్‌ఫోన్ల పంపిణీ, గ్రాట్యుటీ కోసం రూ.20 కోట్లు కేటాయింపు వంటి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
NDL: చాగలమర్రి మండలం NREGS మొదటి విడత కింద నిర్మించిన నాలుగు CC రోడ్లను MLA అఖిలప్రియ ఇవాళ ప్రారంభించారు. మొదటి విడతకు రూ.2.50 కోట్లు, రెండో విడతకు రూ.2.02 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మండలంలో రోడ్లు, డ్రైనేజీల కొరత లేకుండా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల హామీల మేరకు ఆళ్లగడ్డ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.
NZB: మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పూలాంగ్ చౌరస్తాలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. మాదిగ ఉపకులాల అభివృద్ధి కోసం అసువులు బాసిన వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
VKB: దుద్యాల మండలం హంసన్‌పల్లి నుంచి బొంరాస్‌పేట మండలం లింగన్‌పల్లి మీదుగా హైదరాబాద్ బీజాపూర్ 163వ జాతీయ రహదారి వరకు ఇటీవల డబుల్ రోడ్డు వేశారు. కాగా, మూలమలుపులు ప్రమాదకరంగా మారినా అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
HYDలో జూబ్లీ బస్టాండ్ నుంచి గోదావరిఖని వెళ్లే బస్సుల లిస్టును ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం 3:51, సాయంత్రం 4:23, 4:26, రాత్రి 11:18 గంటలకు జూబ్లీ బస్టాండ్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని, అటువైపు వెళ్లే ప్రయాణికులందరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు ఉదయం సమయంలో 9:45, మధ్యాహ్నం 12:15, 12:45 గంటలకు సైతం ఉన్నాయి.
TG: సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం విజయనగర్ కాలనీలో కేంద్రమంత్రి బండిసంజయ్ పర్యటించారు. ఈ సందర్బంగా BJP సర్పంచ్ అమూల్యకు రూ.10 లక్షల గ్రాంట్ అందించారు. కాగా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామాల అభివృద్ధికి తక్షణమే రూ.10 లక్షల కేంద్ర నిధులు అందేలా చేస్తానని బండి సంజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సత్యసాయి: గోరంట్ల మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 80 కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. నార్సింపల్లి పంచాయతీ ఎర్రపల్లికి చెందిన వైసీపీ నాయకుడు పద్మనాభం రెడ్డి, ఎంపీటీసీ తిప్పమ్మతో పాటు మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సవిత వారందరికీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని 216 జాతీయ రహదారికి సమీపంలో ఉన్న బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ సమయం అనంతరం ఆలయం తిరిగి తెరుచుకుంటుందని, భక్తులు అవగాహనతో సహకరించాలని కోరారు.
SDPT: దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో ఆదివారం పెద్దమ్మ పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ATP: నార్పల మండలం జంగం రెడ్డి పల్లె గ్రామ సమీపంలో ఆదివారం నాటు సారా స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఎస్సై సాగర్ మాట్లాడుతూ.. నాటు సారా తయారు చేస్తున్నారని సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించమన్నారు. అందులో భాగంగా 300 లీటర్ల నాటు సారా బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. నాటు సారా తయారుచేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 153/7 పరుగులు చేసింది. సికందర్ రజా 73, క్లైవ్ మదండే 26* రన్స్ చేశారు. మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మఫాక, బోష్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ చేరగా.. జింబాబ్వే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
మఖానా (తామర గింజలు) అద్భుతమైన పోషక విలువలున్న సూపర్ ఫుడ్. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.మఖానాతో ఎముకలు దృఢంగా మారుతాయి. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తపోటు, బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
VKB: పరిగిలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న 39వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.