• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రమాదకరంగా మారిన గుంతలు

కృష్ణా: కోడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిలిచిన నీటిని మళ్లించి, గుంతలు పూడ్చాలని మంగళవారం ప్రయాణికులు కోరుతున్నారు. ప్రధాన రహదారి నుంచి బస్టాండ్ లోపలికి వెళ్లేందుకు రెండు ప్రక్కల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వర్షం కురిసినప్పుడు అవి చెరువుల్ని తలపిస్తున్నాయని, వాటి కారణంగా ప్రయాణికులు ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

September 9, 2025 / 04:34 PM IST

కార్మికులకు సైబర్ నేరాలపై అవగాహన

MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి శివారులోని ఇండూస్ మెడికేర్ కంపెనీలో కార్మికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. పని ప్రదేశాలలో సురక్షితమైన వాతావరణం అందించడానికి అవసరమైన అంశాలపై అవగాహన కల్పించారు. వేధింపులపై షీ టీం పాత్రను వివరించారు.

September 9, 2025 / 04:33 PM IST

‘కాళోజీ భావితరాలకు స్ఫూర్తి’

SDPT: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించిన ఉత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, ఆయన జయంతిని నిర్వహిస్తూ భావితరాలకు స్ఫూర్తిని అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.

September 9, 2025 / 04:33 PM IST

బీజేపీ కార్యాలయంలో జిల్లా కార్యశాల

మెదక్: పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షతన సేవా పక్షం జిల్లా కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్లమెంట్ కో కన్వీనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేయవలసిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు.

September 9, 2025 / 04:33 PM IST

‘గొర్రెలకు టీకాలు వేయించాలి’

GDWL: గొర్రెలకు ఉచిత టీకాలను వేయించాలని ఇటిక్యాల మండల వైద్యాధికారి డాక్టర్ భువనేశ్వరి అన్నారు. మంగళవారం ఆమె మండల పరిధిలోని కోదండాపురంలో పశువులు, గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ సీజన్లో పాడి పశువులు ఎక్కువగా మర్బిల్లి వ్యాధులకు గురవుతాయన్నారు. తీవ్రమైన విరేచనాలు, దగ్గు లక్షణాలు ఉండి జీవాలు చనిపోతాయని అన్నారు.

September 9, 2025 / 04:33 PM IST

‘హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం’

NZB: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని PDSU NZB జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రివాల్యుయేషన్ కాకుండా గ్రూప్ 1మెయిన్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా TGPSC అవకతవకలు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

September 9, 2025 / 04:32 PM IST

త్రాగునీటి సరఫరా సమస్యలపై వెంటనే చర్యలు

BPT: బాపట్ల పురపాలక సంఘ కమిషనర్ జి. రఘునాథ రెడ్డి మంగళవారం పట్టణంలోని పలు వార్డులను విస్తృతంగా పర్యటించారు. త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యంపై శానిటరీ ఇన్స్పెక్టర్లతో మాట్లాడి, చెత్త నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.

September 9, 2025 / 04:31 PM IST

‘గంధమల్ల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి’

యాదాద్రి: హైదరాబాద్‌లోని జలసౌధలో ఈరోజు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. గంధమల్ల ప్రాజెక్టు పనులను ప్రారంభించి వేగవంతం చేయాలని మంత్రిని కోరారు.

September 9, 2025 / 04:30 PM IST

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో రేవంత్ రెడ్డి భేటీ

TG: CM రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 కింద తెలంగాణకు ఇంకా పెండింగ్‌లో ఉన్న హామీలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల విడుదల, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

September 9, 2025 / 04:30 PM IST

విద్యార్థులు ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి: సీఐ

కోనసీమ: విద్యార్థులంతా ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండాలని మండపేట టౌన్ సీఐ డి. సురేష్ అన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ వర్క్ షాప్ పేరిట మండపేట అపోస్థలిక్ స్కూల్లో జరిగిన అవగాహన సదస్సులో సీఐ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆన్‌లైన్, సైబర్ నేరాలు ఎలా జరుగుతాయనేది విద్యార్థులకు వివరించారు.

September 9, 2025 / 04:30 PM IST

‘ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలి’

KMR: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లో KMR జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ నెల 15న KMRలో జరిగే బీసీ సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని సూచించారు

September 9, 2025 / 04:30 PM IST

జిల్లాలో నూతన అంగన్వాడీ కేంద్రాలు నిర్మించాలి: మల్లేష్

BHPL: జిల్లా కేంద్రంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారపల్లి మల్లేశ్ జిల్లా సంక్షేమ ప్రధాన అధికారిని మల్లేశ్వరికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అనేక అంగన్వాడీ కేంద్రాలు నూతన భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, కొన్ని శిథిలావస్థలో పిల్లలకు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీపసుకోవాలని ఆయన కోరారు.

September 9, 2025 / 04:30 PM IST

కార్పొరేట్ సెలూన్ షాపులకు వ్యతిరేకంగా నిరసనగా ర్యాలీ

ATP: గుంతకల్లులో కార్పొరేట్ సెలూన్ షాపులకు అనుమతులు ఇవ్వరాదని డిమాండ్ చేస్తూ మంగళవారం నాయి బ్రాహ్మణుల సేవా సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ‘గో బ్యాక్ గో బ్యాక్ సెలూన్ షాపులు’ అంటూ నినాదాలు చేశారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు హన్వేష్ మాట్లాడుతూ.. పట్టణంలో పెట్టిన కార్పొరేట్ సెలూన్ షాపులను తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

September 9, 2025 / 04:30 PM IST

‘జడ్పీ హైస్కూల్‌ను రాజకీయ వేదిక మార్చిన YCP’

KDP: జడ్పీ హైస్కూల్లో సైతం రాజకీయాలకు వేదికగా మార్చిన ఘనత బద్వేల్ వైసీపీ నాయకులది అని ప్రజలు విమర్శిస్తున్నారు. మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమానికి జన సమీకరణ కోసం వైసీపీ నాయకులు హైస్కూలును వేదికగా చేసి ప్లకార్డులు, బ్యానర్లతో పాఠశాల ఆవరణంలో నాయకులు నినాదాలు చేశారు. ఇంత జరుగుతున్న హైస్కూల్ హెడ్ మాస్టర్, సిబ్బంది చోద్యం చూస్తూ ఉండి పోయారు అన్నారు.

September 9, 2025 / 04:29 PM IST

యూరియా వాడకం ఆపేయాలి: AO

ప్రకాశం: అధికంగా యూరియా వాడకం వలన నేలకు తీవ్రం నష్టం కలిగిస్తుందని, ఆశించినంత దిగుబడి రాదని ఏవో ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలం మాధవరంలో యూరియాపై అవగాహన నిర్వహించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడాలని, రైతుల ఖర్చులు తగ్గించుకోవాలని ఎంపీడీవో సత్యం సూచించారు. కార్యక్రమంలో VAAలు, రైతులు పాల్గొన్నారు.

September 9, 2025 / 04:28 PM IST