కోనసీమ: విద్యార్థులంతా ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండాలని మండపేట టౌన్ సీఐ డి. సురేష్ అన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ వర్క్ షాప్ పేరిట మండపేట అపోస్థలిక్ స్కూల్లో జరిగిన అవగాహన సదస్సులో సీఐ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆన్లైన్, సైబర్ నేరాలు ఎలా జరుగుతాయనేది విద్యార్థులకు వివరించారు.