• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వెరైటీగా ఉంటుందని ‘చీజ్ బిర్యానీ’ చేసింది.. యాక్, బిర్యానీ పరువు తీశావ్ అంటున్న నెటిజన్లు

వంటల్లో వెరైటీలు చేయడమే కదా అసలు ట్రెండ్. ఒకప్పుడు వంటలను పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. ఇప్పుడు ఫుడ్ రంగం అనేది చాలా పెద్దది. రకరకాల వంటకాలు అందుబాటులోకి వచ్చాయి. రెస్టారెంట్‌కు వెళ్తే ఖచ్చితంగా చాలా రకాల వంటకాలు అక్కడ ఉంటాయి. ఏది తినాలో కూడా అర్థం కాదు. కొన్నింటిని ఇప్పటి వరకు రుచి కూడా చూసి ఉండం. చెఫ్‌లకు నచ్చితే ఎలాంటి ఫుడ్ అయినా చేస్తారు. కస్టమర్స్ మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారంటే ఇక ఆ [&h...

February 3, 2023 / 05:10 PM IST

పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలకు ఆదానీ వ్యవహారంపై రభస కుదిపేసింది. రెండో రోజు పార్లమెంటులో విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో ఉభయసభలు దద్దరిల్లాయి .హిండెన్ బర్గ్ ఆరోపణలపై చర్చ చేపట్టాలని లోక్ సభ, రాజ్యసభ లో విపక్షాలు పట్టుబట్టాయి. మార్కెట్లలో అదానీ గ్రూప్ డీలాపడడడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని అందుకే ఈ వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేశాయి . ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, అ...

February 3, 2023 / 04:36 PM IST

ఫ్రెండ్‌ను చంపి బాడీని లోయలోకి విసిరేయబోయి తనే పడి చనిపోయాడు

కర్మ ఫలం అంటే ఇదే కావచ్చు. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అన్నట్టుగా ఒక యువకుడు తన ఫ్రెండ్‌ను చంపి అతడి బాడీని లోయలో పడేయబోయి కాలు జారి తనే లోయలో పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అంబోలి ఘాట్‌లో చోటు చేసుకుంది. సతారా జిల్లా కరాడ్‌కు చెందిన బౌసో మనే అనే వ్యక్తి ఆర్థిక వ్యవహారాల్లో గొడవలు రావడంతో తన ఫ్రెండ్ సుశాంత్ ఖిల్లరే అనే వ్యక్తిని హత్య చేశాడు. ఆ […]

February 3, 2023 / 04:29 PM IST

మైఖేల్ మూవీ రివ్యూ(michael movie review)

నటీనటులు: సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్, అయ్యప్ప శర్మ దర్శకుడు: రంజిత్ జయకోడి నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2023 గత ఏడాది విడుదలైన ఏ1 ఎక్స్ ప్రెస్, వివాహ బోజనంబు, గల్లీ రౌడీ వంటి చిత్రాలతో నిరాశ చెందిన హీరో సందీప్ కిషన్ మైఖేల్ మూవీతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. […]

February 3, 2023 / 04:09 PM IST

ముగిసిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ అంత్యక్రియలు

టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందుగా ఫిలిం చాంబర్‌లో కె.విశ్వనాథ్ పార్థీవదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి కె.విశ్వనాథ్‌కు నివాళులు అర్పించారు. అభిమానులు భారీగా తరలివచ్చి అంతిమ...

February 3, 2023 / 04:05 PM IST

21వ స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ

ప్రపంచ కుబేరుడు, భారత వ్యాపారవేత్త అయిన గౌతమ్ అదానీ ఆస్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయిన అదానీ తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 21వ స్థానానికి పడిపోయాడు. గత రెండు వారాలుగా గౌతమ్ అదానీ కంపెనీ షేర్లలో నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యనే భారతదేశపు బడా వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ ఇండియాలో అత్యంత ధనవంతుడయ్యాడు. ఆస్తుల పరంగా చూస్తే అదానీ వెనకంజల...

February 3, 2023 / 03:02 PM IST

చెఫ్ అవతారమెత్తి… రోటీలు చేసిన బిల్ గేట్స్

మైక్రోసాప్ట్ వ్యవస్దాపకుడు ,వ్యాపారవేత్త, అమెరికాకు చెందిన దిగ్గజ బిజినెస్ మ్యాన్ ఇప్పడు చెఫ్ అవతారమెత్తారు. అందులోను భారతీయ వంటకాన్ని తయారు చేశారు. ఓ పుడ్ బ్లాగర్ తో కలసి రోటీలు తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాపులర్ బ్లాగర్ ఈటన్ బెర్నాత్ తో కలిసి బిల్ గేట్స్ రోటీ చేశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘బిల్ గేట్స్, నేను కలిసి ఇండియన్ రోటీని తయార...

February 3, 2023 / 02:52 PM IST

విశ్వనాథ్ భౌతికకాయానికి రాజమౌళి, కీరవాణి నివాళులు

కళా తపస్వి, సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి లోనయింది. సినీ ప్రముఖులంతా విశ్వనాథ్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92. విశ్వనాథ్ భౌతికకాయానికి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నివాళులు అర్పించారు. అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి విశ్వనాథ్ భౌతికకాయాన...

February 3, 2023 / 02:44 PM IST

మరో చిన్నారిని కాపాడిన మహేశ్‌ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన సొంత డబ్బులతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అంతేకాకుండా గుంబె జబ్బులతో బాధపడే ఎందరో చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సుమారు 2000 మంద...

February 3, 2023 / 02:41 PM IST

ఆ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు సింగపూర్‌లో ట్రైనింగ్

పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సింగపూర్ లో శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించారు. దీనికి సంబంధించి టీచర్లు టీచర్లను సింగపూర్ పంపించటానికి ఏర్పాట్లు కూడా చేసింది. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. విద్యా వ్యవస్థను పూర్తిగా మారుస్తామని ఆప్ పంజాబ్ ప్రజలకు హామీ ఇచ్చింది.  దీంట్లో భాగంగానే..పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచటానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల...

February 3, 2023 / 02:08 PM IST

వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పాల ధర

పాల వినియోగదారులకు అమూల్ సంస్థ మరోసారి షాకిచ్చింది. కొన్నాళ్లుగా పాల ధరను పెంచుతున్న అమూల్ తాజాగా మరోసారి పెంచేసింది. అన్ని రకాల పాలపై ధరలు పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ సంస్థ ‘గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ప్రకటించింది. గుజరాత్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాల ధరలు పెరుగుతాయని గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. లీటర్ పాలపై రూ.3 వరకు పెంచినట్లు అమూల్ సంస్థ...

February 3, 2023 / 02:02 PM IST

పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ సరికొత్త రికార్డులు!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్‌ను ఆహాలో క్రాస్ చేసిందట. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డును బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్‌గా నిలిచింది. వెండితెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలోను పవన్ కళ్యాణ్ రికార్డుల...

February 3, 2023 / 01:58 PM IST

అదానీ గ్రూప్ సంపద నెలరోజుల్లో 76% పతనం

హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు కుప్పకూలుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్‌లో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ శుక్రవారం ఏకంగా 15 శాతానికి పైగా నష్టపోయింది. సరిగ్గా నెల రోజుల క్రితం రూ.4000కు సమీపంలో ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు రూ.1330 వద్ద ట్రేడ్ అవుతోంది. నెల రోజుల్లో 65 శాతానికి పైగా, గత వారం రోజుల్లో 56 శాతానికి పైగా కుప్పకూలింది. ఉదయం గం.11 సమయంలో ఓసారి రూ.1000 స్థాయి...

February 3, 2023 / 01:28 PM IST

విపక్షాల పట్టు.. రెండో రోజు స్తంభించిన పార్లమెంట్

అదానీ గ్రూప్‌ పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారం పార్లమెంట్ ను వీడడం లేదు. ఆ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు రెండు రోజు కూడా ఆందోళన చేశాయి. అదానీ గ్రూపుపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై సభలో చర్చించాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబట్టాయి. వీరి ఆందోళనతో ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. చదవండి: పుట్టుక నీది.. చావు నీది అంటూ త...

February 3, 2023 / 01:04 PM IST

మా పార్టీలోకి మీ ఎమ్మెల్యే..: వైసీపీకి అఖిలప్రియ హెచ్చరిక

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి పైన మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రవి టీడీపీలో చేరేందుకు ప్లాట్‌ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారని, కానీ తాము ఈ నెల 4న ఆయన అక్రమాలు అన్నింటిని ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించారు. మాపై ఏవైనా ఆరోపణలు చేసేముందు, అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆధారాలు తీసుకు రావ...

February 3, 2023 / 01:01 PM IST