టర్కీ, సిరియాల్లో సంభవించిన భీకర భూకంపం(Turkey earthquake) దాటికి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు రెండు దేశాల్లో మృతుల సంఖ్య 4,300 దాటేసిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. టర్కీలో 3000 మందికిపైగా మృతి చెందారని, మరోవైపు సిరియాలో బాధిత మృతుల సంఖ్య 1500కు చేరిందని వెల్లడించారు. ఇంకా శిథిలాల్లో చిక్కుకున్న అనేక మందిని తొలగిస్తున్నారు. మరోవైపు టర్కీ, సిరియాలో సుమారు 19 వేల...
ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలో మార్చి 5న శ్రీ ఆది జాంబవ అరుంధతి హిందూ మాదిగ అన్నదాన సత్రానికి భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని అందరి సాయంతో సత్రం నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. సత్ర నిర్మాణ కమిటీ పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుందని డొక్కా తెలిపారు. భక్తుల నుంచి విరాళాలు సే...
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ సంబంధించిన డేట్స్ ను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల 4 నుండి 26వ తేదీవరకు ముంబైలో జరుగుతుంది. బ్రబ్నోర్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియం ఈ లీగ్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరి 13న ముంబైలో పాకిస్థాన్‌తో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ తర్వాత ఒక రోజు వేలం నిర్వహిస్తామని ఛైర్మైన్ తెలిపారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఇండియాలోనే కాద...
స్టార్ హీరో ధనుష్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ హీరో నటించిన సార్ మూవీ ట్రైలర్ రేపు(ఫిబ్రవరి 8న) రిలీజ్ కానుంది. స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌ని స్ట్రిక్ట్ లెక్చరర్‌గా చూపిస్తున్న కొత్త పోస్టర్ ను మేకర్స్ విడుదల చేస్తూ ప్రకటించారు. వెంకీ అట్లూరి రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం 90ల నాటి కథాంశంతో తెరకెక్కించనట్లు తెలుస్తోంది. వ్యాపార లాభం కోసం పిల్లలకు వ...
భద్రాద్రి సీతారాముల కల్యాణ తేదీని వైదిక కమిటీ నిర్వాహకులు ఖరారు చేశారు. మార్చి 30 న రాములోరి కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 31న పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరిపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్...
స్పీడుగా రైడ్ చేస్తున్న రెండు బైక్ లను చేయిలతో పట్టుకుని ఆపగలరా? కొంచెం కష్టమే అని చెప్పవచ్చు. కానీ ఓ పోటీలో భాగంగా పంజాబ్ కు చెందిన లవ్‌ప్రీత్ సింగ్ (24) అనే వ్యక్తి ఏకంగా నాలుగు బుల్లెట్ బైక్ లను ఆపాడు. అది కూడా మాములుగా కాదు. తాళ్లను నాలుగు ద్విచక్రవాహనాలకు కట్టి బైకర్లు వాటిని ముందుకు రైడ్ చేస్తుండగా లవ్ దీప్ చేతులతో పట్టుకుని ముందుకు వెళ్లనీయకుండా ఆపేశాడు. పంజాబ్ లుథియానా జిల్లాలో...
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి ఈసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అది కూడా వైసీపీ పైర్ బ్రాండ్ కొడాలి నాని ప్రాతి నిధ్యం వహిస్తోన్న గుడివాడ నుంచి బరి దిగబోతున్నట్లు చెప్పారు. మొన్నటి వరుకూ ఉమ్మడి రాష్ట్రమే కదా..తెలుగు రాష్ట్రం లో పోటి చేస్తే తప్పేంటి అన్నారు. ఏపీలో పోటీ చేయాలని తనపై ఒత్తడి వస్తోందని, అందుకే గుడివా...
ఫిబ్రవరి 5న ప్రారంభమైన దూరాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. లింగమతుల స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లు కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో జాతర మొత్తం జనాలతో కోలాహలంగా మారింది. సోమవారం ఈ గొల్లగట్టు జాతరకు మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రె...
తెలంగాణలో రైతుల పంట రుణాలు ఈ ఏడాది రూ.90 వేల లోపు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. అందుకోసం బడ్జెట్లో రూ.6,385 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతో రూ.37 వేల నుంచి రూ.90 వేల వరకు ఉన్న వ్యవసాయ రుణాలు మాఫీ కానున్నాయి. అయితే గత బడ్జెట్లో రూ.4000 కోట్లు ప్రకటించిన ప్రభుత్వం ఈసారి మరో రూ.2,385 కోట్లు అదనంగా పెంచింది. రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో సీఎం...
అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కొని చాలా మంది బిల్డర్ల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రధాన నగరాల్లో అపార్టుమెంట్లలో బతికేవారే ఎక్కువగా ఉన్నారు. తమ సొంతింటిని సాకారం చేసుకునేందుకు వివిధ రంగాల్లో పనిచేసేవారు సేవింగ్స్ చేసి ఫ్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. తమ పిల్లలకు పేరెంట్స్ ఈ ఫ్లాట్లను బహుమతిగా కూడా ఇస్తుంటారు. అయితే ఫ్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత వారికి పలు రకాల ఇబ్బందులు అనేవి...
తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంకెల గారడీయేనని, ప్రజలను మోసం చేసే బడ్జెట్ తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులలో 70 – 80 % నిధులు విడుదల కావని అన్నారు. బడ్జెట్ లో చాలా శాఖలకు కోతలు పెట్టారని ఆరోపించారు. నాలుగేళ్లయిన రైతాంగానిక...
టర్కీని భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 7.8 గా భూకంపం నమోదైంది. ఈ భూకంప ధాటికి భవనాలు కుప్పకూలాయి. మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కొన్ని వందల మంది ఈ భూకంప ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా…. టర్కీ భూకంప ఘటనపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సహాయక, మెడికల్ బృందాలను టర్కీ పంపాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జ...
అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ అబ్బాయిలు ఉంటారు. వాళ్లను చూసి కొంచెం ఎక్స్‌ట్రా చేస్తుంటారు. అది ఎక్కడైనా కామనే. కానీ.. అది శృతి మించితేనే అసలు సమస్య. తాజాగా అటువంటి ఘటనే ఒకటి రైలులో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు రైలులో పక్కన అమ్మాయిలను చూసి రెచ్చిపోయారు. వాళ్ల ముందు పోజులు కొట్టారు. ఆ తర్వాత ఇద్దరూ వాళ్ల ముందు సిగరెట్ వెలిగించి అమ్మ...
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైల్వే ప్రయాణికులు తమ వాట్సాప్ నంబర్ ద్వారా తమకు ఇష్టమైన, రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ పెట్టొచ్చు. ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్‌బోట్‌ను ఇందుకోసం రైల్వే అందుబాటులోకి తెస్తోంది. ఈ చాట్‌బోట్‌పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేసి తమకు నచ్చిన ఆహారాన్ని...
బీహార్‌లో రైలు ఇంజిన్, బ్రిడ్జీ చోరి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా 2 కిలోమీటర్ల మేర పట్టాలను తీసుకెళ్లారు. ఈ ఘటన గత నెలలో జరిగింది. విచారణ జరిపితే ఇద్దరు ఉద్యోగుల పాత్ర ఉందని తెలిసింది. దీంతో వారిని విధుల నుంచి తప్పించారు. సమస్తిపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌ను దొంగిలించి స్క్రాప్ డీలర్‌కు విక్రయించారు. షుగర్ మిల్లుకు అనుసంధానం అయ్యే ట్రైన్ ట్రాక్ పై రాకపోకలు లేవు. దీంతో ...