GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ పెద్ద మసీద్ మక్బుల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మౌలానా రజాక్ సర్వ మానవాళి సుఖసంతోషాలతో, శాంతియుతంగా జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై ఉపవాస దీక్షలను విరమించారు.
NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ క్యాన్సర్ చికిత్స పొందుతూ మరణించారు. శనివారం రాష్ట్ర పశుసంవర్థక, క్రీడా, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నారాయణ భౌతికకాయానికి పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో మంత్రి పాల్గొని చనిపోయిన కార్యకర్త లక్ష్మీనారాయణ పాడెను మోశారు.
TPT: తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి SAAP చెస్ లీగ్ ప్రారంభమైంది. శాప్ ఛైర్మన్ రవి నాయుడు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులను గుర్తించి శాప్ అకాడమీల్లో ప్రవేశాలు కల్పించడమే లీగ్ లక్ష్యమన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో 2,445 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు.
RR: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండకి చెందిన అశోక్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2,50,000 మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నర్నె శ్రీనివాస్ రావుతో కలిసి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అందజేశారు.
TG: HYD కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో రూ.1400 కోట్ల విలువ చేసే ఏడు ఎకరాల పార్కు స్థలంలో నిర్మించిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో అక్రమ కట్టడాలు చేపట్టారని పూర్తి ఆధారాలతో కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తగిన ఆధారాలు లభించడంతో అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు.
AP: మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా విడుదల చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఈ సహాయం అందించినట్లు వెల్లడించారు. దీంతో 95 మంది కుటుంబాలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. రూ.4.75 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు.
SKLM: పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. శనివారం పోలాకి మండలం గొల్లలవలసలో అధికారులు నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే చీపురు పట్టుకుని గ్రామంలో రహదారులను శుభ్రం చేశారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు.
TPT: తిరుపతి హౌసింగ్ కార్యాలయంలో ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు పనులను వేగవంతం చేసి, నాణ్యత సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి ఉగాది నాటికి ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. సమావేశంలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
MDK: తూప్రాన్ మండలం కిష్టాపూర్ శివారు ఇసుక ఫిల్టర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. హల్దీ వాగు పరిసరాలలో అక్రమంగా ఫిల్టర్లను ఏర్పాటు చేసి తీసుకొని తయారు చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ దాడులు చేశారు. దాడుల్లో పైపులైన్లు, విద్యుత్ లైన్‌లను ధ్వంసం చేశారు
MLG: ఆకుల వారి గణపురం, భూపాల్ నగర్ గ్రామాలకు చెందిన పలువురు యువత, వివిధ పార్టీల నేతలు నేడు మంత్రి సీతక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకువెళ్లి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
ADB: ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణితో పాటు అన్ని మండల కేంద్రాల్లోని MPDO కార్యాలయాల్లో యధావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. నమోదైన ప్రతి ఫిర్యాదుపై అధికారులు 30 రోజుల్లోగా పరిష్కార నివేదిక సమర్పించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
SRD: సిర్గాపూర్ మండల పరిషత్ ఆఫీస్‌లో నూతన సర్పంచులు, కార్యదర్శులకు శనివారం సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో శారద నూతన సర్పంచులకు విధులు బాధ్యతలపై అవగాహన కల్పించారు. జీపీ గ్రామసభ, సాధారణ సమావేశం, తీర్మానం, కార్యదర్శిలతో సమన్వయంపై సూచనలు ఇచ్చారు. సంగారెడ్డిలో ఈనెల 23 నుంచి జరిగే ప్రత్యేక శిక్షణ తరగతులకు సర్పంచులు వెళ్లాలని సూచించారు.
కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద శనివారం లారీ ఢీకొని కేసర్ల హేమసుందర్ (56) మృతి చెందారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తమ్ముడు కేసర్ల పార్థసారథి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతోంది.
W.G: తణుకు సజ్జాపురం మహాలక్ష్మి నగర్ లోని ఖాళీ స్థలాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక అధికారి అజయ్ కుమార్ వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఖాళీ స్థలంలోని పిచ్చిమొక్కలకు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
BDK: తెలంగాణ ఉద్యమకారుడు మణుగూరు మండల పరిధిలోని 220 కెవి సబ్ స్టేషన్ ప్రాంత నివాసి అక్కినపల్లి సైదులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం సైదులు ఆరోగ్య పరిస్థితి ని వైద్యులను చరవాణి ద్వారా అడిగి తెలుసుకున్నారు.