• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాహుల్ తో కలిసి అడుగులు వేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్..!

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. కాగా…  ఈ జోడో యాత్రలో ఆయనతో పాటు చాలా మంది ప్రముఖులు కలిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ జోడో యాత్రలో పాల్గొని రాహుల్‌ వెంటన నడిచారు. బుధవారం ఉదయం సవాయ్‌ మాధోపూర్‌ నుంచి ప్రారంభమైన ‘జోడో యాత్ర’లో పాల్గొన్న ఆర...

December 14, 2022 / 06:49 PM IST

బీఆర్ఎస్ వైరస్ లాంటిది.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్…!

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీలో… ఈ రోజు కేసీఆర్…తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్  పార్టీ.. వైరస్ లాంటిదని… దానికి వైరస్ తమ బీజేపీ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయం పెయింట్ ఆరకముందే వీఆర్ఎస్ అవుతుందన్నారు. కేసీఆర్ అండ్ టీమ్ దాదాగిరి...

December 15, 2022 / 12:09 PM IST

పోలీసులు రౌడీ మూకల్లా ప్రవర్తించారు…. రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ లో పోలీసులు దాడులు చేయడాన్ని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఇది ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేయడమే అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై రైడ్ చేసి..అందులోని సిబ్బందిని ఎత్తుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్ రూమ్ లోని 50 కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని చెప్పారు. రేవంత్...

December 14, 2022 / 05:40 PM IST

తెలంగాణ జాగృతి… ఇక భారత జాగృతి…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన సంగతి తెలసిందే. ఆ పార్టీని కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా… ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా పరిచయం చేసేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలో… ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితతో పెద్ద స్కెచ్ ప్లాన్ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తెలంగాణ జాగృతి తరహాలో భారత్ జాగృతి ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారత్ జాగృతి పేరు రిజిస్టర్ చేశ...

December 28, 2022 / 11:23 AM IST

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత: ఇండియాకు మద్దతుగా అమెరికా

భారత్-చైనా మధ్య ఈ నెల 9వ తేదీన జరిగిన ఘర్షణ విషయంలో అగ్రరాజ్యం అమెరికా భారత్ వైపు నిలిచింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత్ తీసుకునే ప్రతి చర్యకు తాము మద్దతు ఇస్తామని అమెరికా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో ఎల్ఏసీ వెంబడి భారత్-చైనా ఘర్షణను యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ పరిశీలిస్తోందని పెంటగాన్ తెలిపింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా బలగాలు నిత్యం ఎల్ఏసీ వెంట తచ్చాడటం, సైనిక,...

December 14, 2022 / 05:26 PM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్..!

ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు . ఆండ్రూ ఫింట్లాఫ్ కారు ప్రమాదానికి గురికావడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కొంత ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. ప్రాణాప్రాయం లేదని వైద్యులు తెలిపారు. బీబీసీ షో టాప్ గేర్ కోసం షూటిగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అతని ప్రమాదం గురించి బీబీసీ ముందుగా ప్రకటన విడుదల చేసింది...

December 14, 2022 / 03:41 PM IST

తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడి, లోక్ సభలో వాయిదా తీర్మానం

తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ దాడులపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఉంది. కాంగ్రెస్ వ్యూహకర్త సునిల్ కనుగోలు కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలోని ఎస్‌‍కే కార్యాలయం కంప్యూటర్, లాప్‌టాప్‌ లను పోలీసులు సీజ్ చేసారు. గత కొంతకాలంగా ఎస్‌కే టీమ్ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది. సోదాల సమయంలో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వ...

December 16, 2022 / 12:59 PM IST

వారాహిపై రాద్దాంతం, నిబంధనల గురించి వైసీపీ మాట్లాడటమా!?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహిపై రాద్దాంతం కొనసాగుతోంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సందర్భం వచ్చినప్పుడు, పదే పదే జనసేనానిని టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు వారాహిని టార్గెట్ చేస్తోంది. పవన్ వాహనం ఆలివ్ గ్రీన్‌లో ఉందని, ఇదీ మిలటరీ రంగులా ఉందని, కాబట్టి రిజిస్ట్రేషన్ కాదని వైసీపీ నేతలు మొదట చెప్పారు. కానీ అది ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని తేలింది. అంతేకాదు, తెల...

December 15, 2022 / 12:23 PM IST

నిర్మల వర్సెస్ రేవంత్ హిందీ: కల్వకుంట్ల కవిత ఏమన్నారంటే?

లోకసభలో నిర్మలా సీతారామన్, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రూపాయి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి సభలో ప్రశ్నించారు. ఈ సమయంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తెలంగాణ నుండి వచ్చిన వారికి హిందీ అంతగా రాదని, అలాగే, తనకు కూడా హిందీ అంతగా రాదని, ...

December 15, 2022 / 12:53 PM IST

ప్రత్యేక హోదాపై ప్రశ్న, హామీ ఎవరిచ్చారని స్పీకర్ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఇటీవల కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు సభలో లేవనెత్తుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో నాటి కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టకుండానే, ప్రత్యేక హోదా హామీని ఇచ్చింది. తాము బిల్లులోని ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేక హోదా బిల్లులో లేదని, అలాగే ఇప్పుడు సాధ్యం క...

December 15, 2022 / 12:51 PM IST

గవర్నర్‌ను వర్సిటీల ఛాన్సలర్‌గా తొలగిస్తూ కేరళలో బిల్లు పాస్

కేరళ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో కీలక బిల్లును పాస్ చేసింది. యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా గవర్నర్ ఉండటానికి స్వస్తీ పలుకుతూ బిల్లును తీసుకువచ్చింది. అంతేకాదు, గవర్నర్‌కు బదులుగా విద్యారంగ నిపుణులను ఆ పదవిలో నియమించడానికి కూడా ఈ బిల్లు అనుమతిస్తుంది. ఈ బిల్లుకు రాష్ట్ర శాసన సభ మంగళవారం ఆమోదం తెలిపింది. కేరళ గవర్నర్ ఆరీఫ్ మొహమ్మద్ ఖాన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గత కొద్ది రోజులుగా ఇందుకు సంబంధించి వ...

December 23, 2022 / 12:00 PM IST

అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్లకు పైగా ఎన్పీఏల రైటాఫ్

బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను (NPA) రైటాఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. ఇందులో గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలోనే రూ.8.5 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు తెలిపారు. అలాగే, ఇదే కాలంలో పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన ఒక లక్ష మూడువేల కోట్ల రైటాఫ్ లోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. నాలుగేళ్లు దాటిన మొండి బకాయిలను బ్యాంకులు ర...

December 13, 2022 / 08:19 PM IST

షరతులు గుర్తుంచుకోండి: షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. షర్మిల పాదయాత్రకు ఓకే చెప్పిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, గతంలోని షరతులను గుర్తు చేసింది. ఈ షరతులకు అనుగుణంగా పాదయాత్ర ఉండాలని తెలిపింది. షర్మిల తరఫున అడ్వోకేట్ వరప్రసాద్ వాదనలు వినిపించారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ వైయస్సార్ తెలంగాణ పార్టీ నేతలు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజకీయ, మతపరమైన అ...

December 13, 2022 / 08:13 PM IST

అరవింద్ ఎక్కడ పోటీ చేసినా, ప్రచారం చేసి ఓడిస్తా: కవిత

భారత రాష్ట్ర సమితితో (BRS) తాము దేశంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వచ్చే ఎన్నికల కంటే ముందే తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. బీజేపీకి సరైన సమయంలో బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తెలంగాణ గౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మను కూడా అవమానించేలా మాట్లాడాతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ బ్రెయిన్ చెడిపోయిందన్నారు. అంద...

December 13, 2022 / 08:09 PM IST

భారత్-చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తత, ఇరువైపుల సైనికులకు గాయాలు

అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో వాస్తవాదీన రేఖ వెంట ఈ నెల 9వ తేదీన భారత్ – చైనా మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ఇరుపక్షాలు గాయపడ్డాయి. ఈ మేరకు భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. ఎంతమందికి గాయాలైన విషయం తెలియాల్సి ఉంది. అయితే మొదట్లో ఆరుగురికి గాయాలైనట్లుగా నివేదిక రాగా, ఆ తర్వాత ఈ సంఖ్య ఇరవైకి చేరుకుంది. అయితే గాయపడినవారు చైనా సైనికులే అధికమని తెలుస్తోంది. [&hel...

December 13, 2022 / 08:03 PM IST