తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీలో… ఈ రోజు కేసీఆర్…తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ.. వైరస్ లాంటిదని… దానికి వైరస్ తమ బీజేపీ పార్టీ అని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కార్యాలయం పెయింట్ ఆరకముందే వీఆర్ఎస్ అవుతుందన్నారు. కేసీఆర్ అండ్ టీమ్ దాదాగిరి, గుండాగిరి చేస్తే.. రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
బూటకపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు సంజయ్. తెలంగాణ సంపదను దోచుకున్న కేసీఆర్ కు… రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వైరస్ అయితే.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వ్యాక్సిన్ అని వ్యాఖ్యానించారు.
వైరస్ కావాలో.. వ్యాక్సిన్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదన్నారు. బెంగళూరు, హైదరాబాద్ మాదకద్రవ్యాల కేసుల వ్యవహారాన్ని వదిలేది లేదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తప్పుల చిట్టా అంతా తన దగ్గర పెట్టుకొని, వారిని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.