పుట్టినప్పుడు ఎవరైనా సగం మనిషి (man) గా సగం జంతువుగా ఈ ప్రపంచంలోకి వచ్చారని కథలు లేదా మాయా చిత్రాలలో చూసి ఉంటారు. సాధారణంగా అలా జరగడం చాలా అరుదు. కానీ యూఎస్ (USA ) ఫ్లోరిడాలో ఓ పిల్లవాడు అలాగే జన్మించాడు. అతని వీపు భాగంలో తాబేలు పెంకులా కనిపించే విభిన్నమైన చర్మపు పొర ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సీనియర్ హీరో వెంకటేష్ చేసిన పనికి.. మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) సైతం వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెంకటేష్‌ను ఫ్యామిలీ హీరోగానే చూశాం. కానీ ఓటిటి కోసం చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రం.. వెంకీ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేసింది. అసలు ఓటిటి కంటెంట్ అంటేనే.. సెన్సార్ కట్స్ లేకుండా ఉంటుంది. వల్గారిటీ లేకుండా ఓటిటిలో వచ్చే వెబ్ సిరీస్‌లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు...
జవాన్ల త్యాగం వృథా కానివ్వమని. నక్సలైట్ల పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సీఎం భూపేష్ చెప్పారు. కాగా, అమర జవాన్ల మృత దేహాలను వాహనాలలో స్వస్థలాలకు తరలించే సమయంలో సీఎం ఒక జవాన్ శవపేటికను తన భుజంపై మోశారు.
99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ MG మోటార్ ఇండియా ఈరోజు(ఏప్రిల్ 27న) తన స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనం MG కామెట్ EVని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. నగరంలో సాఫీగా, ఒత్తిడి లేని ప్రయాణం చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఈ వాహనం ఫీచర్లు, ధరను ఇప్పుడు తెలుసుకుందాం.
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)పై విజయం సాధించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్లు, సిబ్బందికి కఠిన ఆంక్షలు విధించింది. పార్టీలో ఢిల్లీ ప్లేయర్ ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించిడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
కేటుగాళ్ల మాయలో పడి, అధిక వడ్డీ ఆశతో చాలా మంది డబ్బులను పోగొట్టుకుంటున్నారని, క్యూ నెట్ తరహా దందా పెరుగుతోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉప్పల్(Uppal), సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులు, మెట్రో స్టేషన్‌తో ఈ వంతెనను అనుసంధానించారు. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది. ఈ స్కైవాక్‌ను రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించారు. దాదాపు 1,000 టన్నులకు పైగా స్టీల్‌ను వినియోగించి, అధునాతనంగా స్కైవాక్‌ను తీర్చిదిద్దారు.
సీబీఐ(cbi) విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(delhi liquor scam) కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(manish sisodia) జ్యుడీషియల్ కస్టడీని అవెన్యూ కోర్టు మే 12 వరకు పొడిగించింది.
జియో టెలికం మార్కెట్లోకి ఎలా చొచ్చుకుపోయిందో గుర్తు తెచ్చుకోండి. డేటా, కాల్స్ అన్ లిమిటెడ్ గా ఉచితం. ఫ్రీగా సిమ్ తీసుకుని వాడుకోండి. ఈ విధమైన ఆఫర్లతో యూజర్లను సొంతం చేసుకుంది జియో. అలా ఏడాది పాటు అన్నీ ఉచితంగా ఇచ్చిన సంస్థ నెలవారీ చేసుకోవాల్సిన రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) కూడా ఇదే బాటలో నడుస్తోంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay kumar)పై పోలీసులు వేసిన బెయిల్ రద్దు పిటిషన్ ను హన్మకొండ కోర్టు కొట్టివేసింది. సంజయ్ కి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోరగా.. విచారణకు సహకరించడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కానీ ప్రాసిక్యూషన్ వాదనలతో మేజిస్ట్రేట్ విభేదించారు. బెయిల్ రద్దుకు తగిన కారణాలు లేవని సంజయ్ తరఫు న్యాయవాది వాదించారు. ఇది కూడా చూడండి: Uppal Skywalk : మే ...