టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివబా జడేజా రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏకంగా.. ఎన్నికల బరిలో నిలుస్తుండటం గమనార్హం. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆమెకు టికెట్ వచ్చే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారంగా ఉంది. రివబా జడేజా 2019లో బీజేపీలో చేరడం గమనార్హం. గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి బీజేపీ ...
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యేకు ఊరట లభించింది. ఎట్టకేలకు ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విద్వేష వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా 40 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాజా సింగ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. భవిష్యత్తులో ఎలా...
తెలంగాణ గవర్నర్ తమిళి సై తెలంగాణ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల బీజేపీ నేతలు తమ ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారంటూ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా… తాజాగా గవర్నర్ తమిళి సై సైతం అలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన ఆమె కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు పై ఆల్రెడీ ఒక ప్రాసెస్ కొనసాగుతుందని, ఎందుకు బోర్డ్ తీసుకు రావాల్సి వచ్చిం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ మత ప్రభోధకుడు కేఏపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ విలువ రోజు రోజుకీ దిగజారిపోతోందంటూ కేఏ పాల్ పేర్కొనడం గమనార్హం. ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 9 పార్టీలు మారాడని చురకలు అంటించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం మొదలు బహుజన సమాజ్‌వాది పార్టీ, బిజెపి లాంటి ఎన్నో పార్టీలతో జట్టు కట్టి పవన్ క...
ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. నేపాల్ లో బుధవారం తెల్లవారు జామున సంభవించిన భూకంపంలో ఆరుగురు మరణించగా , అయిదుగురు గాయపడ్డారు. భూకంప ప్రభావానికి దోతీ జిల్లాలో ఓ ఇల్లు కూలిపోయిందని జిల్లా ప్రధాన అధికారి కల్పనా శ్రేష్ఠ తెలిపారు భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా రికార్డయిందన్నారు. ఈ ప్రకృతి వైపరీత్యానికి అనేక చోట్ల ఇళ్ళు కూలిపోయాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకా...
చంద్రగ్రణహం పూర్తి అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేసింది. గ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపించాడు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో గంటపాటు గ్రహణం ఏర్పడగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాలు కొనసాగింది. దేశంలో 2 గంటల 19 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు కనిపించింది. అయితే, దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో చంద్రగ్రహణం ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రా...
మనలో చాలా మంది చిన్న కష్టానికే కుంగిపోతారు. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్యలకు పాల్పడేవారు కూడా ఉన్నారు. అయితే.. ఎంత కష్టమొచ్చినా ఎదురించగల సత్తా ఉంటే.. జీవితంలో ఏదైనా సాధించవచ్చని ఓ మహిళ నిరూపించింది. కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు.. తన కుటుంబానికి మూడు పూటలా తిండి పెట్టేందుకు ఓ మహిళ క్యాబ్ డ్రైవర్ గా మారింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర...
ప్రేమ ఎప్పుడు, ఎవరికి ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఎవరూ ఊహించలేరు కూడా. ప్రేమను కులం, మతం అనే తేడా ఉండదు. అంతేకాదు… ప్రేమించిన వారిని దక్కించుకోవడానికి దేశాలు దాటినవారు కూడా ఉన్నారు. ఈ కథ కూడా అలాంటి కథే. ఓ మహిళ.. తాను కోరుకున్న యువకుడి కోసం.. దేశాలు దాటి వెళ్లింది. అయితే.. ఇక్కడ వారి వయసు మధ్య తేడా 50ఏళ్లకు పైగా ఉండటం గమనార్హం. 83 ఏళ్ల పోలిష్ మహిళ… 28 ఏళ్ల పాకిస్థాన్ […]
ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రయోజకులు కావాలనే కోరుకుంటారు. అందుకే.. వారి స్థోమతకు మించి కూడా ఉన్నత విద్యను అందిస్తూ ఉంటారు. పిల్లలు సైతం తమ తల్లిదండ్రుల కలను నిజం చేయాలని అనుకుంటారు. అందుకోసం శాయశక్తులా శ్రమిస్తూ ఉంటారు. ఇలానే ఓ యువతి కూడా… ఉన్నత లక్ష్యానికి చేరుకొని… తనని కన్న తల్లిదండ్రులు మరింత గర్వపడేలా చేయాలని అనుకుంది. అందుకోసం ఉన్నత విద్యను అభ్యసించడానికి యూనివర్శిటీకి వెళ్...
ఈతకు వెళ్లి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు(Six people died). వారిలో ఐదుగురు విద్యార్థులు కాగా… ఒకరు ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. ఐదుగురు విద్యార్థులు ఈతకొడుతూ నీటిలో మునిగిపోతుండగా… వారిని కాపాడటానికి ప్రయత్నించి.. ఆ ఉపాధ్యాయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మేడ్చల్(medchal) జిల్లా జవహర్ నగర్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జవహార్‌నగర్ పరిధిలో ఉన్న మల్కాపురంలోని...
ఆమె ప్రపంచంలోనే ఎత్తైన మహిళ(World’s tallest woman) విమానంలో ప్రయాణించింది. ఆమె విమానం(plane) ఎక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టర్కీకి చెందిన 25 ఏళ్ల రుమెయ్సా గెల్గీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. టర్కీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్ళడానికి ఆమె మొదటిసారి విమానం ఎక్కింది. ఈమె కోసం టర్కిష్ ఎయిర్‌లైన్ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ఆరు సీట్లను...
మునుగోడు(Munugode) ఉప ఎన్నిక కోసం ఇటీవల ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక ఫలితం రేపు విడుదల కానుంది. రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా… ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉండనుంది అనే విషయంపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఫలితం తమకు అనుకూలంగా రానుందని ఆయనకు అందిన నివేదికలో తేలినట్లు వార్తలు వస్తున్నాయి. బూతుల వారీగా పోలింగ్ లెక్కలు తెప్పించుకుని అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుక...
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan kalyan) గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన అభిమానులకు చెందిన 53ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడంతో హుటాహుటిన పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. శుక్రవారం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో జనసేన అభిమానుల ఇళ్లను కూల్చివేయడంతో పవన్ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు ఇప్పటం గ్రామంలో ఆయన పర్యటించాలని అనుకున్నారు. అయితే… ఆయన పర్యటన...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కేసు నమోదు అయ్యింది. రాహుల్ తో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. ఇంతకీ రాహుల్ పై కేసు నమోదు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా..? కేజీఎఫ్ సినిమా మ్యూజిక్ వాడటం. అసలు మ్యాటరేంటంటే… రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. యాత్ర ప్రచార వీడియోల్లో తమ అనుమతి లేకుండా కేజీఎఫ్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ [...
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ(nandigama) పర్యటనలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయితో విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది మధుబాబుకి గాయమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసుల భద్రత సరిగా లేకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ దాడులకు బయపడేది లేద...