»Ex Minister Adinarayana Reddy Comments On Pawan And Chandrababu Meet
Pawan Kalyanతో చంద్రబాబు భేటీకి కారణం ఇదే: మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసుల్లో నిందితులు ఎవరో అందరికీ తెలిసిపోయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఏ పార్టీ , మరే పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో సమావేశం అయ్యారు. వీరి భేటి ఇప్పుడు చర్చనీయాంశమైంది. పవన్ బీజేపీతో పొత్తు కంటిన్యూ చేస్తాడా లేక టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము అన్నారు. మూడు ప్రధాన పార్టీలు కలసి వచ్చే ఎన్నికల్లో పనిచేయనున్నాయని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్-చంద్రబాబు, చంద్రబాబు-ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్-ప్రధాని భేటీల ఉద్దేశమన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే బ్రాండ్ ను పూర్తిగా చెడగొట్టారని.. స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే విమర్శించారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసుల్లో నిందితులు ఎవరో అందరికీ తెలిసిపోయిందన్నారు. గతంలో తాము వివేకాను తాను, బీటెక్ రవి చంపినట్లు దుష్ప్రచారం చేశారన్నారు. అలాగే 2019 ఎన్నికల్లో లబ్ధి పొందారన్నారు.. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అన్నారు.