NZB: ఆలూర్ మండలం కల్లెడి గ్రామానికి చెందిన తాహెరాబేగం ఎల్లారెడ్డి మండల నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీఓ కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి సన్మానించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తాహెరాబేగం హామీ ఇచ్చారు.
CTR: GD నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో లీగల్‌పై అవగాహన సమావేశం గురువారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మనోహర్ గౌడ్ తెలిపారు. ఉదయం 11గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జి భారతితో పాటు జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీప్యూటీ సీఈవో వెంకటనారాయణ, అన్ని శాఖల అధికారులు హాజరవుతున్నట్లు చెప్పారు.
SDPT: మొంథా తుఫాన్ కారణంగా జిల్లాకు ఎల్లో అలర్ట్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోవడం, తడిసిన చేతులతో స్టార్టర్లు, మోటార్లు ముట్టుకోవడం, గాలి దుమారంకు తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోవడం వంటివి చేయవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ADB: నాటుసారా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ విజయేందర్ హెచ్చరించారు. బుధవారం భోరజ్ మండలంలోని పిప్పర్ వాడ చెక్పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి మోటార్ సైకిల్ పై అక్రమంగా రవాణా చేస్తున్న దేశిదార్ ని పట్టుకున్నట్టు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అధికారులు తదితరులున్నారు.
MDK: అల్లాదుర్గం నూతన MPDOగా చిల్పూరి వేద ప్రకాశ్ రెడ్డి నియమితులయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో భాగంగా గ్రూప్-1 ఉద్యోగం సాధించి అల్లాదుర్గం మండల MPDOగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కార్యాలయ సిబ్బంది శాలువాతో సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానన్నారు.
అన్నమయ్య: రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లికి చెందిన గొంతు సుబ్రహ్మణ్యం (50)ను యువతిని పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులో కడప 7వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జి. ఎస్. రమేష్‌కుమార్ బుధవారం జీవిత ఖైదు, రూ. 1. 60 లక్షల జరిమానా విధించారు. 2022 మార్చి 22న బాధితురాలు చేసిన ఫిర్యాదుతో రైల్వేకోడూరు పోలీసులు 376, 417 IPC కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు.
బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం మోదీ డ్యాన్స్ చేయమని అడిగితే, వేదికపైనే డ్యాన్స్ చేస్తారని దుయ్యబట్టారు. భీహారీలు ఛత్ పూజా సందర్భంగా ఢిల్లీలోని కాలుష్యమైన యమునా నదిలో పూజాలు చేసుకుంటున్నారని.. మోదీ మాత్రం ప్రత్యేకంగా తయారు చేసిన స్మిమ్మింగ్ పూల్‌లో స్నానం చేశారని ఎద్దేవా చేశారు.
KRNL: వాతావరణ మార్పుల నేపథ్యంలో డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డా.ఎల్ బాస్కర్ బుధవారం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, నీరు నిల్వ లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమతెరలు ఉపయోగించాలని, బకెట్లు, కొబ్బరి బొండాల్లో నీరు నిలవకుండా జాగ్రత్త పడాలని ఆయన కోరారు.
KDP: మెంథా తుఫాన్ నేపథ్యంలో, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ బుధవారం వల్లూరు మండల పరిధిలోని ఆదినిమ్మాయపల్లి ఆనకట్టను పరిశీలించారు. ఆనకట్ట స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మైలవరం డ్యాం నుండి పెన్నా నదికి నీరు వదలడం వల్ల ఆనకట్టకు నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ప్రకాశం: పెద్దారవీడు మండలం తోకపల్లి బ్రిడ్జి వద్ద తీగలేరు వాగు ప్రవాహన్ని అధికారులతో కలిసి యర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పరిశీలించారు. సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని కోరారు.
ATP: రాష్ట్రంలో పీపీపీ విధానం ద్వారా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి, కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం గుత్తి మండలంలోని శ్రీపురం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
PPM: పోస్ట్ డిజాస్టర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను హెచ్చరించారు. ఎటువంటి సమస్య వచ్చిన సమన్వయంతో సాధించగలమని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారని కలెక్టర్ వివరించారు.
E.G: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో నీటమునిగిన పంటపొలాలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని, అవసరమైన సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజల, రైతుల భద్రత కోసం ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
VZM: వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా బుధవారం తెర్లాం మండలంలోని గంగన్నపాడు గ్రామాన్ని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ గ్రామంలో నర్సిపల్లి వారి బంధ చెరువు ఓవర్ ఫ్లో కావడంతో గ్రామంలోని ప్రధాన వీధుల్లోనీటి ప్రవాహం కొనసాగుటుండటం గమనించిన కలెక్టర్ ఇరిగేషన్ ఏఈతో మాట్లాడి తక్షణం నీటి ప్రవాహం బయటకు పోయేవిధంగా చర్యలు తీసుకోవాల న్నారు.
CTR: రేపు (గురువారం) పుంగనూరులో నిర్వహించే శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి బుధవారం తెలిపారు. “శ్రవణ నక్షత్రం” సందర్భంగా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు మహోత్సవం జరుగుతుందని చెప్పారు. అనంతరం అధిక సంఖ్యాలో భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొని తిలకించాలని కోరారు.