గత ఏడాది డిసెంబర్‌లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ఎలాన్ మస్క్ తన స్థానాన్ని కోల్పోయి..తాజాగా మళ్లీ నంబర్ వన్ స్థానానికి వచ్చారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా స్టాక్స్ 100% పెరిగిన నేపథ్యంలో 187 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలాన్ మస్క్ తిరిగి ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడని నివేదికలు చెబుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ మహిళ ఒక రాజకీయ నాయకుడి (political leader) కాలర్ పట్టుకొని, చెప్పులతో కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో సిద్ధార్థ్ నగర్ కి చెందినది. ఈ వీడియోలో ఓ మహిళ... నాయకుడి చొక్కా పట్టుకొని కొడుతోంది.
ts bjp leaders met amith shah:తెలంగాణ బీజేపీ నేతలు హస్తినలో బిజీగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీశ్ సిసోడియా (manish sisodia) అరెస్ట్ తర్వాత.. వారు దేశ రాజధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) ఆరోపణలు వచ్చాయి.
EAMCET : తెలంగాణ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఎస్ ఎంసెట్ కోసం కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రముఖ నటి అదితి రావ్ హైదరీ, హీరో సిద్ధార్థ్ కలిసి ఓ వైరల్ పాటకు డాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు ప్రముఖులు ఆసక్తికరంగా కామెంట్లు చేశారు. అవెంటో తెలియాలంటే ఈ వార్తను చదవాల్సిందే.
record rate in teja mirchi:మిర్చి (mirchi) ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈసారి క్రాప్ (crop) కూడా ఎక్కువే వచ్చింది. ఖమ్మం (kammam) మిర్చి మార్కెట్‌లో తేజ మిర్చి (teja mirchi) ధరకు రికార్డ్ ధర పలికింది. క్వింటా (quinta) మిర్చికి రూ.21,625 ధర వచ్చింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర (rate) అని అక్కడి రైతులు చెబుతున్నారు.
తెనాలిలో (Tenali) నాలుగో సంవత్సరం వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ (PM Kisan) నిధులను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) మంగళవారం విడుదల చేశారు. ఆయన తన తాడేపల్లి ప్యాలెస్ (tadepalli palace) నుండి తెనాలికి (Tenali) హెలికాప్టర్ పైన రావడం చాలామందిని విస్మయపరిచింది. దీనిపై జనసేన (Janasena) పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నా...
Surf Excel:సర్ఫ్ ఎక్సెల్.. తెలుసు కదా.. సర్ఫ్, ఫేమస్ కూడా. అయితే ఈ బ్రాండ్ సేల్స్‌లో రికార్డు సృష్టించింది. గత ఏడాది బిలియన్ డాలర్ల సేల్స్ పూర్తిచేసుకుంది. ఇండియన్ హోమ్ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. రూ. 8200 కోట్ల విక్రయాలతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. హిందుస్థానీ యూనిలీవర్ సంస్థలో ఈ స్థాయిలో సేల్స్ జరిగిన తొలి బ్రాండ్ కూడా సర్ఫ్ ఎక్సెల్ కావడం విశేషం.
Prahlad Modi : ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ఆస్పత్రి పాలయ్యారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కాగా.. అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
Telangana News : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. భూపాలపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ తో మొదలైన వైరం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కేసీఆర్ పర్యటనలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ , ఫ్లెక్సీలను ఇంకా తీయలేదని కాంగ్రెస్ శ్రేణులు నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.
అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ(Lionel Messi) గురించి తెలియనవారంటూ ఉండరు. ముఖ్యంగా ఫుట్ బాల్ లవర్స్ కి మెస్సీ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా ఈ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ బెస్ట్ మెన్స్ ప్లేయర్(Best Mens Player Award) అవార్డును అందుకున్నారు. పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్ బాట్ అసోషియేషన్(FIFA) బెస్ట్ ఫిఫా ఫుట్ బాట్ అవార్డ్స్ నిర్వహించింది. ఈ వేడుకల్లో మెస్సీ అవా...
Sourav Ganguly : రిషభ్ పంత్ ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడుతాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షాకిచ్చాడు. పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడానికి కనీసం రెండేళ్లు అయినా పడుతుందని ఆయన చెప్పడం గమనార్హం.
వరుస భూకంపాలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం పలు చోట్ల భూకంపాలు(Earthquake) చోటుచేసుకున్నాయి. మణిపూర్‌లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2.46 గంటలకు నోనీలో భూ ప్రకంపనలు జరిగాయి. రిక్టర్ స్కేలు(Richter scale)పై 3.2 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ లో కూడా భూకంపాలు(Earthquakes) వచ్చాయి.
బడ్జెట్ రూపొందించడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రం ఆదాయం అత్తెసరుగా వస్తోంది. ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ ఉంది. అన్ని మార్గాల ద్వారా అప్పులు తీసుకుంటున్నాం. రాష్ట్ర బడ్జెట్ లో అప్పుల (Debits) లెక్కలు ఎలా కనుమరుగు చేయాలనే దానిపై దృష్టి పెట్టారు.
ఈశాన్య రాష్ట్రల్లో మళ్లీ కమలం వికసిస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీ( BJP) అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే మేఘాలయ (Meghalaya) రాష్ట్రంలో మాత్రం బీజేపీకి చుక్కెదురు అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.