శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport)లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్(Hyderabad) వచ్చిన ప్యాసింజర్ చేతిలో అనుమానాస్పదంగా కన్పించిన బ్యాగ్ ను అధికారులు తనిఖీ చేశారు.
కొంతమంది గూగుల్ పే యూజర్లు స్క్రాచ్ చేయగానే వారి ఖాతాల్లో దాదాపు 80వేల రూపాయల వరకు జమ అయ్యాయి. అయితే ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగింది.
రెండు రోజులుగా తప్పిపోయిన రెండేళ్ల పసిబిడ్డ మృతదేహం ఆదివారం పొరుగువారి ఇంట్లో సూట్‌కేస్ లో కనిపించింది. పొరుగు ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు.
వార్ 2 చిత్రం(war2 movie) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఈ మూవీలో ఇప్పటికే హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తుండగా..హీరోయిన్ ఎవరనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అలియా భట్(alia bhatt) ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది.
సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్మూనిటీ భవన్, రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్ ...
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
దలైలామా గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడ్డాడు. తదుపరి బౌద్ధ గురువు మహిళ అయితే ‘ఆమె చాలా అందగత్తె అయ్యి ఉండాలి’ అని పేర్కొని వివాదాస్పదమయ్యాడు. గతంలో కూడా కొందరితో బాలుడితో ప్రవర్తించినట్టు అసభ్యంగా చేశారు.
ప్రాజెక్ట్ K(Project K) అనేది ఇప్పటివరకు భారతీయ తెరపై నిర్మించిన అత్యంత ఖర్చుతో కూడిన చిత్రం. ఈ మూవీలో ప్రభాస్(prabhas) యాక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని 'రైడర్స్' కోసం కాస్ట్యూమ్స్ మేకింగ్ చూపించే వీడియోను విడుదల చేశారు. ఈ రైడర్‌లు ప్రాజెక్ట్ Kలో విలన్ లేదా సైన్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయం...
వేసవి కాలం (summer season) తీవ్రరూపం దాలుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ(Department of Meteorology)హెచ్చరించింది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.. వేడిగాలులు ఠారెత్తిస్తున్నాయి. దీంతో వాతావరణశాఖ ప్రజల్ని అప్రమత్తం చేసింది.
ఏషియన్ ఫిలిమ్స్(asian films) నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఒక సరికొత్త పిరియాడిక్ ఫిల్మ్ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ ప్రొడక్షన్ నెంబర్:1 చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పనస(Ravikumar Panasa) నిర్మిస్తున్నారు. మసూద ఫేమ్ తిరువీర్(thiruveer) ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు జి.జి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వినూత్నంగా ప్రత్యేక కార్యక్రమానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) శ్రీకారం చుట్టింది. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని శాసన సభ్యులు, ఇంచార్జ్‌లు, నాయకులు జోష్‌తో నిర్వహిస్తున్నారు. జగనన్నే మా భవిష్యత్తు'(Jagananne ma bhaviṣyattu) కార్యక్రమంలో భాగంగా 'మెగా పీపుల్స్ సర్వే'కు అపూర్వ స్పందన లభించటంతో ఆ పార్టీకి చెందిన నాయ...
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) చూస్తే చిన్న పిల్లలాగా అనిపిస్తుంది. కానీ ఈ అమ్మడు ప్రస్తుతం దేశంలో అత్యధికంగా పారితోషకం తీసుకునే హీరోయిన్ల జాబితాలో టాప్ లో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక్కో చిత్రానికి రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలిసింది. అంతేకాదు ఆమెకు ఆస్తులు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
Harish Rao: సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సమావేశానికి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆటో డ్రైవర్ యూనిఫాం ధరించి, ఆటోరిక్షా నడుపుతూ వచ్చారు. అంబులెన్స్ రాకముందే అనేక సందర్భాల్లో గాయపడిన ప్రయాణికులను హాస్పిటల్స్ కు చేర్చడం, టూరిస్టులను సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లడం, మార్గమధ్యంలో టూర్ గైడ్ చేయడం వంటి అనేక పనులు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవలను మంత్రి కొనియాడారు. సొసైటీ నాలుగో వార...
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) యాక్ట్ చేసిన వకీల్ సాబ్(Vakeel Saab) చిత్రం నిన్నటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్(venu sriram) అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ క్రమంలో వకీల్ సాబ్ 2 కూడా పక్కాగా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
అండమాన్ నికోబార్ (Andaman Nicobar) దీవులను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భుమి కంపించింది. రిక్టర్ స్కేలు(Richter scale)పై దీని తీవ్రత 4.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్ సీఎస్) తెలిపింది. భుకంప కేంద్రం క్యాంప్‌బెల్ (Campbell) తీరానికి 220 కిలో మీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది.