Shamshabad Airport: స్క్రూలుగా అరకిలో బంగారం.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport)లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్(Hyderabad) వచ్చిన ప్యాసింజర్ చేతిలో అనుమానాస్పదంగా కన్పించిన బ్యాగ్ ను అధికారులు తనిఖీ చేశారు.
Shamshabad Airport:దేశంలోని ఎయిర్ పోర్టులన్నీ అక్రమంగా బంగారం రవాణా చేసేందుకు అడ్డాలుగా మారాయి. ఎన్నో సార్లు కస్టమ్స్ అధికారులు స్మగ్లర్ల ఆటలు కట్టించినా బంగారం రవాణా జరుగుతూనే ఉంది. స్మగ్లర్లు బంగారం తరలించేందుకు కొత్త పద్ధతులను కనుగొంటూనే ఉన్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport)లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్(Hyderabad) వచ్చిన ప్యాసింజర్ చేతిలో అనుమానాస్పదంగా కన్పించిన బ్యాగ్ ను అధికారులు తనిఖీ చేశారు. సదరు ప్రయాణికుడు బ్యాగ్(Bag)కి స్క్రూస్ రూపంలో అరకిలో బంగారం అమర్చినట్లు గుర్తించారు. వెంటనే బ్యాగ్‌ను సీజ్ చేసి…ప్యాసింజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 454 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. పట్టుబడిన బంగారం(Gold) విలువ రూ. 21.20 లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
గత కొద్దికాలంగా బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది. అదే సమయంలో విదేశాల్లో బంగారం తక్కువ ధరకు రావడంతో.. అక్కడ నుంచి తెచ్చి స్మగ్లర్లు ఇక్కడ అమ్ముతున్నారు. అధిక లాభాలు వస్తుండడంతో అక్రమార్కులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్(Dubai) నుంచి వచ్చిన ప్రయాణికుడు తన బ్యాగ్ లో స్క్రూలు, కడ్డీల్లా బంగారం అమర్చినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తింంచారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.