MNCL: లక్షెట్టిపేట మండలంలోని వార్డు సభ్యులకు రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నామని స్థానిక ఎంపీడీవో సరోజ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఉన్న 160 మంది వార్డు సభ్యులలో 80 మంది చొప్పున శిక్షణ ఇస్తామన్నారు. పట్టణంలోని రైతు వేదికలలో ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు, మార్చి 3 నుంచి 8 వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఆ శిక్షణకు వార్డు సభ్యులు రావాలని ఆమె కోరారు.
TG: సిద్ధిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు బాల్ రెడ్డి దారుణహత్యకు గురయ్యారు. మారణాయుధాలతో బాల్ రెడ్డిని దుండగులు హత్య చేశారు. దుబ్బాక మండలం రాజక్కపేట శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. బైకుపై రాజక్కపేట నుంచి చెల్లాపూర్‌లోని ఇంటికి వెళ్తుండగా దాడి చేశారు. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు క్లూస్ టీమ్, పోలీసులు చేస్తున్నారు. రాజకీయ కక్షలు, భూవివాదం కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
GNTR: మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును శుక్రవారం గుంటూరులోని ఆయన నివాసంలో పొన్నూరు మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ డా. రూత్ రాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు.
ప్రకాశం: కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుని కనిగిరి అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు శుక్రవారం శీలవారిపల్లి గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్‌లో నూతనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తమ వంతు సహాయ సహకారాలు కావాలని కోరారు. దీంతో ఆయన అంబేద్కర్ విగ్రహానికి రూ. 1,01,116 రూపాయలు అందజేస్తానని వెల్లడించారు.
AP: మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ‘పుష్ప సినిమా డైలాగ్‌లు Xలో పెట్టటం కాదు.. మీ మ్యాచ్ టికెట్‌లకు డబ్బులు ఎక్కడివో పోస్ట్ చేయండి. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్ని స్పెషల్ ఫ్లైట్ టికెట్‌లు మీ డబ్బులతో కొన్నారో చెప్పండి. లోకేష్ ఎవరి డబ్బులతో ఫ్లైట్ బుక్ చేసి శ్రీలంక వెళ్లారు?’ అని నిలదీశారు.
AP: మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ‘పుష్ప సినిమా డైలాగ్‌లు Xలో పెట్టటం కాదు.. మీ మ్యాచ్ టికెట్‌లకు డబ్బులు ఎక్కడివో పోస్ట్ చేయండి. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్ని స్పెషల్ ఫ్లైట్ టికెట్‌లు మీ డబ్బులతో కొన్నారో చెప్పండి. లోకేష్ ఎవరి డబ్బులతో ఫ్లైట్ బుక్ చేసి శ్రీలంక వెళ్లారు?’ అని నిలదీశారు.
KDP: ఖాజీపేట మండలంలో సుమారు 2వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామీణ ల్యాండ్ మాఫియా కబ్జా చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ ఆరోపించారు. శుక్రవారం జరిగిన ‘భూ సదస్సు’లో ఆయన మాట్లాడుతూ.. 10 గ్రామాల్లో కబ్జాలకు గురైన ఈ భూములను అధికారులు వెంటనే కాపాడాలని, కబ్జాదారులకు రాజకీయ పార్టీల అండ ఉందని విమర్శించారు.
BDK: చుంచుపల్లి మండల కార్యాలయంలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. విద్యాచందన హాజరై రుణాల 100% రిపేమెంట్, PMKSY పనుల పూర్తి, యూనిఫామ్‌ల తయారీని సమర్థంగా చేపట్టాలని ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతపై గ్రామస్థాయి బాధ్యత వహించాలని సూచించారు.
KMM: చింతకాని మండలంలో 50% రాయితీపై ట్రాక్టర్లు, రోటవేటర్లు ఇస్తామని నమ్మించి ఓ ముఠా 55 మంది రైతుల నుంచి రూ. కోటికి పైగా వసూలు చేసింది. కొత్తగూడెం కేంద్రంగా కార్యాలయం తెరిచి, ఫోన్‌పే, బ్యాంకుల ద్వారా నగదు జమ చేయించుకుని పరారైంది. తొలుత కొందరికి తక్కువ ధరకు యంత్రాలిచ్చి నమ్మకం కలిగించి ఈ మోసానికి పాల్పడ్డారు.
JGL: సీఎం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పెగడపల్లి మండల కేంద్రంలోని ZP ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు పాఠశాల HM లలిత, ఫిజికల్ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. 10వ తరగతి చదువుతున్న యోగేశ్ జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగేశ్‌ను ఎంఈవో, ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు.
MNCL: లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో త్వరలో సోలార్ ఎనర్జీ అందుబాటులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మూడు గ్రామాలను ఎంపిక చేయగా అందులో వెంకట్రావుపేట ఒకటి. ఆ గ్రామానికి మొత్తం 1139 సోలార్ యూనిట్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. అందులో ప్రస్తుతం 400 సోలార్ యూనిట్లను అధికారులు సిద్ధం చేశారు. త్వరలో గ్రామంలో సోలార్ ఎనర్జీ అందుబాటులోకి రానుంది.
JN: బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా వివిధ గ్రామాలకు నీరు అందించేందుకు గాను కాలువల్లో పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులను నేడు జనగామ గ్రంథాలయ ఛైర్మన్ రాంబాబు ప్రారంభించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఛైర్మన్ అన్నారు.
KNR: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర పోషించాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో స్థానిక సర్పంచులకు ట్రైనింగ్ జరిగింది. పంచాయతీ రాజ్ చట్టంపై సర్పంచులు అవగాహన కలిగి ఉండాలన్నారు. సంక్షేమ పథకాలతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
తూ.గో జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో రైతులు పండించిన శనగలను కనీస మద్దతు ధర క్వింటా ఒక్కింటికి రూ. 5,875 వేల చొప్పున కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టినట్లు జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ దేవరపు ప్రతాప్ శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా RBK వద్ద శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుటకు నిర్ణయించామన్నారు. పూర్తి వివరాలకు RBK కేంద్రాల్లో సంప్రదించాలన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని పెద్ద కమ్మవారిపల్లిలో శ్రీ చెన్నకేశవ స్వామి, పోతలయ్య, బంగారు లింగమయ్య వార్షిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. దారపునేని చంద్రశేఖర్ నివాసం నుంచి స్వామివారి వెండి కవచాలను ఉరుము, డప్పు వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు యలువగంప మహోత్సవం నిర్వహించారు.