• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఐదో అంతస్తు నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

HYD: పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. కొంపల్లి సమీపంలోని ఓ భవన నిర్మాణ స్థలంలో ఐదో అంతస్తు నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. భవన నిర్మాణ పనుల కోసం తల్లితో కలిసి వచ్చిన బాలిక, బాల్కనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. తీవ్ర గాయాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

February 20, 2026 / 11:38 AM IST

తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే దంపతులు

PDPL: శ్రీ తిరుమల తిరుపతి స్వామి వారిని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కలు చెల్లించారు. దర్శనానంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

February 20, 2026 / 11:37 AM IST

‘ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదల పాలిట గొప్ప వరం’

MHBD: నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారురాలు తుప్పతూరి అనసూర్య ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను ఇవాళ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇళ్లు లేని నిరుపేదల పాలిట గొప్ప వరమని అన్నారు.

February 20, 2026 / 11:37 AM IST

ఈ నెల 22న ‘టీజీసెట్’.. ఉట్నూర్‌లో ఏర్పాట్లు పూర్తి

ADB: సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్ (TGCET-2026)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉట్నూర్ లాల్ టెక్డి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ హరిరామ్ తెలిపారు. ఈ నెల 22న (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లతో పాటు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలన్నారు.

February 20, 2026 / 11:36 AM IST

‘అధికారం అంటే ప్రజల సమస్యలు పరిష్కరించడం’

KMM: అధికారం అంటే గద్దె మీద కూర్చోవడం కాదు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో శ్రమించడం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌‌ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ పోకబత్తిని అనిత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు.

February 20, 2026 / 11:36 AM IST

‘ప్రతి ఒక్కరు పంట నమోదు చేసుకోవాలి’

ప్రకాశం: తాళ్లూరు మండలం మల్కాపురం గ్రామం లో పంట నమోదు వివరాలను ఏవో ప్రసాద రావు శుక్రవారం పరిశీలించారు. ఈ పంట నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో సూపర్ చెక్ చేయటం జరుగుతుందని ఏవో చెప్పారు. రబీలో ఇప్పటి వరకు 17,536 ఏకరాలు ల్యాండ్ చేయటం జరిగిందన్నారు. కావున ప్రతి ఒక్కరు పంట నమోదు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 11:36 AM IST

వైసీపీ నేతలతో మండలి ఛైర్మన్ భేటీ

AP: మండలి ఛైర్మన్‌ మోషెన్ రాజును కూటమి నేతలు కలిశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మండలిలోకి ఫొటోలు తీసుకుని రావడాన్ని తప్పుబట్టారు. దీంతో వైసీపీ సభ్యులతో మోషన్ రాజు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు YCP ఎమ్మెల్సీల పాల్గొన్నారు.

February 20, 2026 / 11:36 AM IST

పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలి: ఎంపీడీవో

ASR: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని శుక్రవారం కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు హెచ్చరించారు. వ్యాపారులు, దుకాణాల ఎదుట విధిగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు అందరూ సహకరించాలన్నారు. దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్లను విక్రయించరాదని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

February 20, 2026 / 11:36 AM IST

రుతువుల మార్పిడితో వర్షం కురిసే అవకాశం

BDK: మూడ్రోజులపాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితు ల కారణంగా ఈ నెల 21 నుంచి 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 22 న ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లా ల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

February 20, 2026 / 11:35 AM IST

రాజమండ్రి రూరల్లో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరం కాటన్ బ్యారేజీపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆత్రేయపురం మండలం రాజవరంకి చెందిన కేదరశెట్టి వీర వెంకట సత్యనారాయణ ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వెళ్తుండగా బ్యారేజీ 14వ గేటు వద్ద ప్రమాదవశాత్తు వంతెనను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 11:34 AM IST

‘పత్తి కొనుగోలు గడువును మార్చి 15 వరకు పొడిగించాలి’

ASF: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి 15 వరకు పొడిగించాలని వాంకిడి మండల రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ కవితకు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 20తో గడువు ముగియనుండటంతో సమయాన్ని పెంచి అందరికీ న్యాయం చేయాలని కోరారు. మండలంలోని రైతులు పత్తి పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వారు పేర్కొన్నారు.

February 20, 2026 / 11:34 AM IST

ఎమ్మెల్యేను కలిసిన రామగుండం మున్సిపల్ పాలకవర్గం

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎలిగేడులోని ఆయన నివాసంలో ఇటీవల ఎన్నికైన రామగుండం మున్సిపల్ పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగరం మేయర్ మహంకాళి స్వామి డిప్యూటీ మేయర్ ఎల్లయ్య ఎమ్మెల్యేని కలిసి నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

February 20, 2026 / 11:34 AM IST

కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి: MP

SDPT: కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని MP రఘునందన్ రావు స్పష్టం చేశారు. అక్బర్‌పేట్ భూంపల్లి మండలం బొప్పాపూర్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. గ్రామంలో గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలతో పాటు వివిధ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.82 లక్షలు కేటాయించడంతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

February 20, 2026 / 11:34 AM IST

ఈ నెల 23 నుంచి శ్రీకాళహస్తీశ్వర పరివార దేవతల ప్రతిష్ఠ మహోత్సవాలు

TPT: చిట్టమూరు మండలం ఉప్పలమర్తి గ్రామంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పరివార దేవతల నూతన విగ్రహ ప్రతిష్ఠ, మహా కుంభాభిషేక మహోత్సవాలు ఈనెల 23 నుంచి 25 వరకు వైభవంగా జరగనున్నాయి. 23న గ్రామోత్సవం, 24న విశేష పూజలు నిర్వహిస్తారు. 25న మహా కుంభాభిషేకం, అనంతరం శాంతి కళ్యాణం, అన్నదానం జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

February 20, 2026 / 11:33 AM IST

‘సమస్య పరిష్కారానికి కృషి చేయాలి’

BDK: చుంచుపల్లి మండలం NK నగర్ బాదావత్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్ అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలోని సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సత్వరంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇందిరా, ఉప సర్పంచ్ మాలోత్ లక్ష్మి పాల్గొన్నారు.

February 20, 2026 / 11:32 AM IST