• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పోలీస్ స్టేషన్ కు చేరిన ఇంటర్ ప్రశ్నా పత్రాలు..!!

SRPT: ఈనెల 25 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు ఇంటర్ ప్రశ్న పత్రాలను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా నడుమన తీసుకువచ్చారు. జూనియర్ కళాశాలలకి సంబంధించి ప్యాక్ చేసిన ప్రశ్నాపత్రాలను పరిశీలించి, పోలీసుల ఆధ్వర్యంలో స్టేషన్ లాకర్లలో భద్రపరిచారు.

February 22, 2026 / 05:27 PM IST

తపాలా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉంది: జ్యోతిరాదిత్య

AP: గుంటూరులో నిర్వహించిన గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య పాల్గొన్నారు. తపాలా వ్యవస్థపై గ్రామ ప్రజలకు ఇంకా విశ్వాసం ఉందని ఆయన అన్నారు. తపాలా వ్యవస్థను గ్రామీణులు ఇంకా ఆదరిస్తున్నారని తెలిపారు. గ్రామీణ డాక్ సేవక్‌ల సేవలు మరిచిపోలేమన్నారు. MP, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో గ్రామీణ డాక్ సేవక్ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.

February 22, 2026 / 05:26 PM IST

రౌడీ షీటర్‌లకు కౌన్సెలింగ్ నిర్వహించిన డీఎస్పీ

ప్రకాశం: కనిగిరిలో రౌడీ షీటర్లు, లైంగిక నేరస్తులపై డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేరప్రవర్తనకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మంచి పౌరులుగా మారి గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచిస్తూ, ఇకపై నేరాలకు పాల్పడబోమని వారితో ప్రతిజ్ఞ చేయించారు.

February 22, 2026 / 05:26 PM IST

జనసేనలో చేరిన 100 కుటుంబాలు

VZM: విజయనగరంలోని 19వ డివిజన్‌కి చెందిన 100 కుటుంబాలు వైసీపీని వీడి జనసేనలో చేరాయి. బాలాజీ నగర్ కార్యాలయంలో జనసేన నాయకుడు అవనాపు విక్రమ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి యువత జనసేనలోకి రావడం శుభపరిణామన్నారు.

February 22, 2026 / 05:26 PM IST

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ లోని పలు కాలనీలో సుమారు రూ. 4.5 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు MLA KR నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. రోడ్లు-డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 4.5 కోట్లు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

February 22, 2026 / 05:24 PM IST

జగన్ వైఖరితో వైసీపీ పతనం: ఎంపీ శబరి

నంద్యాల: ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆదివారం మాట్లాడుతూ.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం వైసీపీ చేసిన మహా తప్పిదమన్నారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అభ్యంతకరమని, దేవుళ్లను వాడుకుంటూ.. స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంతో వైసీపీ పతనం మొదలైందన్నారు.

February 22, 2026 / 05:23 PM IST

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు

NZB: నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ఆదివారం జిల్లా BJP ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా BJP అధ్యక్షుడు దినేశ్ కులచారి తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

February 22, 2026 / 05:23 PM IST

తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం: వైసీపీ

AP: వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని YCP నేత MVS నాగిరెడ్డి అన్నారు. బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన లెక్కలు చూస్తేనే ఈ విషయం అర్ధమవుతోందని తెలిపారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా చేస్తానని ఇప్పుడు ప్రభుత్వం చెప్తోందని, కానీ అప్పట్లో YSR, జగన్ రుణ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్‌తో ఎప్పుడో చేశారని వెల్లడించారు.

February 22, 2026 / 05:20 PM IST

రైస్ పుల్లింగ్ మోసగాడు డీకే బాబు అరెస్టు

సత్యసాయి: రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ డీకే బాబును పోలీసులు అరెస్టు చేశారు. కదిరి DSP శివన్నారాయణ స్వామి ఆదివారం వివరాలు వెల్లడించారు. నిందితుడు బాధితుడి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేయడమే కాకుండా, కత్తితో బెదిరించి అదనంగా నగదు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నాడు. తనిఖీల్లో భాగంగా నిందితుడి నుంచి ఫార్చునర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు.

February 22, 2026 / 05:20 PM IST

వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీ చేరికలు

E.G: ప్రజలు కోరుకున్న మంచి పాలనను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట మండలం ఇప్పనపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిన్ని గంగాధరరావు తన అనుచరులు సుమారు 100 మందితో కలసి ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు.

February 22, 2026 / 05:20 PM IST

జాబ్ మేళాలో 26 మంది అభ్యర్థులు ఎంపిక

కోనసీమ: రామచంద్రపురంలో ఆదివారం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 26 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ఉపాధి ప్రాజెక్టు డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు రామచంద్రపురం పట్టణంలో 36 జాబ్ మేళాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి, కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అభినందనలు తెలిపారు.

February 22, 2026 / 05:20 PM IST

బసవేశ్వరుని ఆశయాలు ఆదర్శనీయం

VKB: మహాత్మా బసవేశ్వరుడు చూపిన ఆధ్యాత్మిక, సామాజిక మార్గం నేటి సమాజానికి ఎంతో ఆచరణీయమని వికారాబాద్ వీరశైవ సమాజం అధ్యక్షుడు విజయకుమార్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో బసవన్న విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బసవరాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. బసవేశ్వరుడు చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు.

February 22, 2026 / 05:19 PM IST

మౌలిక వసతుల కల్పనకు కృషి : ఎమ్మెల్యే

SRD: అమీన్‌పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:18 PM IST

‘బూత్ స్థాయి నుంచే బీజేపీని బలోపేతం చేయాలి’

SKLM: బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ 2026 కార్యక్రమం గాయత్రీ కాలేజ్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గోపీ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి బీజేపీ పార్టీ బలోపేతం చేయాలని కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేశారు.

February 22, 2026 / 05:18 PM IST

పరీక్షల వేళ విద్యార్థులు ఇలా చేస్తే మంచిది..!

WG: జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ టైమ్ లో విద్యార్థులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి తగినంత నిద్రపోయి, రేపు ఉదయం తేలికపాటి అల్పాహారం తీసుకుని పరీక్షా కేంద్రానికి ముందుగానే బయల్దేరాలని పేర్కొన్నారు. హాల్ టికెట్, పెన్నులు వంటి అవసరమైన వస్తువులను పడుకునే ముందే రెడీ చేసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 05:16 PM IST