• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు: CPM

KMM: మధిర బోడెపుడి భవన్‌లో సీపీఎం పార్టీ డివిజన్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు నమ్మి స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి విజయాన్ని అందించిందన్నారు. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేయొద్దని హితవు పలికారు.

February 20, 2026 / 06:12 AM IST

యువకుడిపై పోక్సో కేసు నమోదు

TPT: పుత్తూరు ప్రాంతానికి చెందిన ఓ బాలికను తిరుపతికి చెందిన యువకుడు యూసఫ్ (23) మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అఘయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 06:12 AM IST

కోదండరామయ్య కళ్యాణానికి 110 కిలోల ముత్యాలు

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ ఏడాది ఏప్రిల్ 1న నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి 110 కిలోల ముత్యాలను కానుకగా ఇచ్చేందుకు నెల్లూరు జిల్లా కోవూరు MLA,TTD పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు లోక్ సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ముందుకొచ్చినట్లు డిప్యూటీ ఈవో ఏ.ప్రశాంతి గురువారం తెలిపారు.

February 20, 2026 / 06:12 AM IST

నేటి నుంచి నగరంలో ట్రాఫిక్ మళ్లింపు

CTR: చిత్తూరు మురకంబట్టులోని చిత్తూరు-పూతలపట్టు రైల్వే మార్గంలో ట్రాక్ మరమ్మతు పనులను శుక్రవారం ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రావెల్ క్రాసింగ్ నంబరు 22 పూర్తి ట్రాక్‌ను అప్ గ్రేడేషన్ చేయనుండటంతో శుక్రవారం నుంచి మార్చి 1వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపునున్నట్లు చెప్పారు.

February 20, 2026 / 06:11 AM IST

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన.. వేములపల్లి వాసి

BHPL: మొగుళ్ళపల్లి (M) వేములపల్లికి చెందిన సాత్విక్ సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల BHPL జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో సాత్విక్ షాట్‌పుట్, జావెలిన్ త్రో విభాగాల్లో అద్భుత ప్రదర్శన చూపించాడు. ఈ రెండు ఈవెంట్‌లలోనూ ఉత్తమ ఫలితాలతో రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.

February 20, 2026 / 06:11 AM IST

‘ప్రైవేట్ స్కూల్ ఫీజులపై నిఘా ఉంచాలి’

ADB: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దందా మితిమీరిపోతోందని రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కరువు కాలంలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ఫీజుల విషయంలో పిల్లలను ఇబ్బంది పెట్టకుండా నేరుగా తల్లిదండ్రులతోనే మాట్లాడేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

February 20, 2026 / 06:09 AM IST

‘మత్స్యకారులకు చట్టసభల్లో అవకాశాలు కల్పించాలి’

AKP: సంప్రదాయం మత్స్యకారులకు చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని జాతీయ మత్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం పాయకరావుపేట సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 లక్షల ఓట్లు ఉన్న మత్స్యకారులను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయన్నారు. ఏ పార్టీ ఇప్పటివరకు మత్స్యకారులకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు.

February 20, 2026 / 06:05 AM IST

నేడు జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

KMR: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు పాల్వంచ మండలంలో పర్యటించనున్నారు. మండల కేంద్రంలోని రైతు సింగిరెడ్డి బలరాం రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న ‘ఆయిల్ పామ్ మొక్కల మాస్ ప్లాంటేషన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యాన అధికారి జ్యోతి హాజరుకానున్నారు.

February 20, 2026 / 06:04 AM IST

ఈ నెల 23 నుంచి ఆదర్శ పాఠశాలలో దరఖాస్తులు స్వీకరణ

VZM: ఈ నెల 23 నుంచి ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ఈశ్వరరావు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 30 వరకు గడువు ఉందని ఆసక్తి గల విద్యార్థులు WWW.CSe.ap.gov.in/ www.apms.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పూర్తి వివరాలకు పాఠశాల పనిచేయు వేళల్లో సంప్రదించవచ్చుని పేర్కొన్నారు.

February 20, 2026 / 06:04 AM IST

బాధితులకు CMRF చెక్కులు పంపిణీ

E.G: రాజానగరం మండలం పల్లకడియం గ్రామానికి చెందిన గంగలూరి పాపయమ్మకు రూ.23,400, రెక్కల చంటిబాబుకు రూ.52,723 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను జనసేన కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి గురువారం పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల కోసం పేదలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ సాయం అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 06:04 AM IST

‘రైతులు తప్పని సరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి’

WNP: రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆత్మకూరు వ్యవసాయ అధికారి అరవింద్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డులు, భూమి యాజమాన్య పాస్ పుస్తకం, ఆధార్ లింకు చేసిన మొబైల్ ఫోన్‌లో సమీపంలోని వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని ఆయన చెప్పారు.

February 20, 2026 / 06:04 AM IST

రంజాన్ మాసంలో చార్మినార్‌కు కొత్త అందాలు

HYD: రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్‌గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్‌ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.

February 20, 2026 / 06:03 AM IST

నేడు మాచర్లలో ఈ-వ్యర్థాల సేకరణకు ప్రత్యేక డ్రైవ్

PLD: మాచర్ల పురపాలక పరిధిలో ఈ-వ్యర్థాల సేకరణకు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుండి పార్క్ సెంటర్ వరకు ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇకపై ప్రతి నెల 10, 20 తేదీల్లో ఈ సేకరణ ఉంటుందని, ప్రజలు తమ పాత ఎలక్ట్రానిక్ వస్తువులను మున్సిపల్ కార్యాలయంలోని కలెక్షన్ సెంటర్‌లో అందజేయాలని ఆయన కోరారు.

February 20, 2026 / 06:02 AM IST

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని స్థానిక పాతూరు ఎస్సీ పాలెంకు చెందిన ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య సంఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కనిగిరి ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 06:02 AM IST

ALERT: మూడు రోజులపాటు వర్షాలు

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు అదే ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడొచ్చని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శని, ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు పలు ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తుందని చెప్పింది.

February 20, 2026 / 06:01 AM IST