»Not Xi Jinping From China Pm Li Qiang To Attend G20 Summit At Invitation Of India
G20 Summit: జి-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గైర్హాజరు.. ఆయన ప్లేసులో ప్రధాని లీ కియాంగ్
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9-10 తేదీల్లో జి-20 సదస్సు జరగనుంది. ఇది 18వ జి-20 సదస్సు. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సుకు ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ హాజరుకానున్నారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ సోమవారం (సెప్టెంబర్ 4) ఈ విషయాన్ని వెల్లడించారు.
G20 Summit: న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9-10 తేదీల్లో జి-20 సదస్సు జరగనుంది. ఇది 18వ జి-20 సదస్సు. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సుకు ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ హాజరుకానున్నారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ సోమవారం (సెప్టెంబర్ 4) ఈ విషయాన్ని వెల్లడించారు. న్యూఢిల్లీలో చైనా ప్రతినిధి బృందానికి లీ కియాంగ్ నాయకత్వం వహిస్తారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు స్టేట్ కౌన్సిల్ ప్రీమియర్ లీ కియాంగ్ సెప్టెంబర్ 9,10 తేదీలలో భారతదేశంలోని న్యూఢిల్లీలో జరగనున్న 18వ G20 సమ్మిట్‌కు హాజరవుతారని.. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఒక ప్రకటనలో ప్రేర్కొన్నారు. భారతదేశం తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశానికి జి జిన్‌పింగ్ గైర్హాజరు కావడానికి అధికార ప్రతినిధి మావో ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు.
ఈ వారం జకార్తాలో జరిగే ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్), తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలకు కూడా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరుకావడం లేదు. ఇండోనేషియాలో జరిగే ఆసియాన్ సదస్సులో చైనా తరపున ప్రీమియర్ లీ పాల్గొంటారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు ప్రస్తుత ఆసియాన్ చైర్, స్టేట్ కౌన్సిల్ ప్రీమియర్ లీ ఇండోనేషియాలోని జకార్తాలో సెప్టెంబర్ 5 నుండి 8 వరకు జరిగే 26వ చైనా-ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన మరో ప్రతినిధి వాంగ్ వెన్బిన్ సెప్టెంబర్ 1న ప్రకటించారు.
At the invitation of the government of the Republic of India, Premier of the State Council Li Qiang will attend the 18th G20 Summit to be held in New Delhi, India on September 9 and 10: China's Foreign Ministry Spokesperson, Mao Ning pic.twitter.com/5p5ggkT3zb
ఇప్పుడు ప్రీమియర్ లీ జకార్తాలో తూర్పు ఆసియా సదస్సుకు హాజరైన తర్వాత భారతదేశాన్ని సందర్శించాలని భావిస్తున్నారు. 2021లో చైనా కోవిడ్-19 ఆంక్షల కారణంగా ఇటలీలో జరిగిన జి-20 సదస్సులో చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ పాల్గొనలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో ‘ప్రత్యేక సైనిక కార్యకలాపాల’పై దృష్టి సారించాల్సి ఉన్నందున ఈ సదస్సుకు వ్యక్తిగతంగా హాజరు కాకూడదని తన నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికే తెలియజేశారు. గతేడాది నవంబర్‌లో జరిగిన G-20 బాలి శిఖరాగ్ర సమావేశానికి కూడా రష్యా అధ్యక్షుడు హాజరుకాలేదు.
జీ20 సభ్య దేశాలు ప్రపంచ జీడీపీలో దాదాపు 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం కంటే ఎక్కువ, ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. గ్రూప్‌లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి.