»A New Variant Of The Dreaded Corona Faster Registration Of Pirola Cases
Pirola Variant: భయపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్..వేగంగా ‘పిరోలా’ కేసులు నమోదు
కరోనాలో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. గత కొన్ని రోజుల నుంచి ఈ వేరియంట్ కేసులు విదేశాల్లో నమోదవుతున్నాయి. అయితే ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకూ భారత్‌లో నమోదు కాలేదు. ఇది ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చినట్లు వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా మహమ్మారి (Corona) ప్రపంచాన్ని తీవ్రంగా నాశనం చేసింది. కరోనా బారిన పడి చాలా మంది ప్రాణాలు వదిలారు. గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అందరూ అనుకుంటున్న తరుణంలో మళ్లీ కొత్త వేరియంట్లు (New Variants) ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మధ్యనే ఎరిస్ (Eris) అనే వేరియంట్ వెలుగులోకి రావడంతో వైద్యనిపుణులు టెన్షన్ పడ్డారు. ఆ వేరియంట్ కేసులు భారత్‌తో పాటుగా పలు దేశాల్లో నమోదవ్వడంతో దానిపై పరిశోధనలు చేస్తున్నారు.
కొత్తగా నమోదవుతున్న కేసులు అన్ని దేశాలకు వ్యాపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో వేరియంట్ పుట్టుకొచ్చింది. ఆ వేరియంట్‌కు పిరోలాస ( BA.2.86) అనే పేరును పరిశోధకులు పెట్టారు. ఇది ఒమిక్రాన్ (Omicron) సబ్ వేరియంట్ కావడం విశేషం. తక్కువ సమయంలోనే ఈ వేరియంట్ చాలా దేశాల్లోకి వ్యాపిస్తోంని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) కూడా గుర్తించింది.
ఒరిజినల్ వేరియంట్‌తో పోలిస్తే ఈ పిరోలా (Pirola) 35 కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలను కలిగి ఉంటుందని, ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ పిరోలా వేరియంట్ (Pirola Variant) కేసులు ఇజ్రాయెల్, కెనడా, డెన్మార్క్, యూకే, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ దేశాల్లో నమోదు కాగా, ఈ వేరియంట్లో 36 మ్యుటేషన్లు ఉన్నాయని, అవి రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోగలవని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.