ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య (Air Pollution) నగరాల్లో ఢిల్లీ (Delhi) పేరు కూడా ఉంది. అధిక కాలుష్యం వల్ల ఢిల్లీలో నివశిస్తున్న ప్రజల ఆయుష్షు 12 ఏళ్లు తగ్గిపోనుందని పరిశోధనలు వెల్లడించాయి. చికాగో (Chicago)లోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్‌పై ఓ నివేదికతో కూడిన డేటాను విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సగటు ఆరోగ్య స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో ఢిల్లీలో కాలుష్యం ఉన్నట్లు ప్రకటించింది.
ఇండియా (India)లో 67 శాతం మంది ప్రజలు తీవ్ర కాలుష్య (Pollurion) పరిస్థితుల్లోనే జీవిస్తున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. పంజాబ్ (Punjab)లోని పఠాన్‌కోట్ ప్రాంతంలో పార్టికులేట్ పొల్యూషన్ డబ్ల్యూహెచ్‌వో (WHO) సూచించిన స్థాయి కన్నా ఏడు రెట్లు ఎక్కువగా ఉందని ప్రకటించింది. ఒకవేళ కాలుష్య తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగితే అప్పుడు జీవితకాలం 3.1 సంవత్సరాలు తగ్గనుందని ఓ రిపోర్టును రిలీజ్ చేసింది.
మిగితా దేశాలతో పోలిస్తే ఢిల్లీ (Delhi)లో సాంద్రత మూడు రెట్లు ఎక్కువగా ఉందని, వాహనాలు, నిర్మాణాలు, వ్యవసాయం వల్ల కూడా కాలుష్యం అధికంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. కాలుష్య వాయువులను పీల్చడం వల్ల బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేషియా దేశాల ప్రజలు తమ ఆరేళ్ల జీవితకాలాన్ని కోల్పోనున్నట్లు తాజా నివేదిక అంచనా వేసింది.