»India Uae Us Saudi Eu Announce Connectivity Corridor Joining West Asia Europe To South Asia
G20 Summit 2023: భారత్-పశ్చిమ ఆసియా-యూరప్ ఆర్థిక కారిడార్‌ను ప్రకటించిన జీ20నేతలు
ఆర్థిక ఏకీకరణను సులభతరం చేసేందుకు జాయింట్ ట్రేడ్ ఎకనామిక్ కారిడార్ ఉపయోగపడుతుంది. ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించిన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, యూరోపియన్ యూనియన్ నేతలు సంయుక్తంగా వెల్లడించారు.
G20 Summit 2023: జీ20 సమావేశం ఢిల్లీలో రెండో రోజు జరుగుతుంది. భారత్, పశ్చిమాసియా, యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను జీ20 నేతలు ప్రకటించారు. ఆర్థిక ఏకీకరణను సులభతరం చేసేందుకు జాయింట్ ట్రేడ్ ఎకనామిక్ కారిడార్ ఉపయోగపడుతుంది. ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించిన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, యూరోపియన్ యూనియన్ నేతలు సంయుక్తంగా వెల్లడించారు.
సీ-రైలు కనెక్టివిటీ కారిడార్ కోసం ఒప్పందం కుదిరింది. భారతదేశం, యుఎఇ, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, అమెరికా దేశాలను కలుపుతూ ఎకనామిక్ కారిడార్ సాకారం అవుతోంది. ఈ తరహా ఒప్పందం ఇదే మొదటిది. భారత్, పశ్చిమాసియా, అమెరికాల మధ్య ఆర్థిక సహకారానికి ఇది అత్యంత ప్రభావవంతమైన సాధనంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
దేశాల సహకారం, మౌలిక సదుపాయాలు మానవ నాగరికతకు ఆధారమని ప్రధాన మంత్రి అన్నారు. భౌతిక మౌలిక సదుపాయాలతో పాటు సామాజిక, ఆర్థిక సౌకర్యాలపై దేశం మునుపెన్నడూ లేని విధంగా పెట్టుబడులు పెడుతున్నదని చెప్పారు. ఎకనామిక్ కారిడార్ చాలా పెద్ద విషయమని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ గొప్ప అవకాశాలను అందిస్తుందని, ఆసియా, మధ్యప్రాచ్యం నుండి ఐరోపాకు ప్రజలను కనెక్ట్ చేయడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. జీ20 దేశాధినేతలు ప్రకటించిన ఈ ప్రాజెక్టు చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌కు ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు.