గోవా- ముంబయి హైవే పై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 9మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి పై రాయగఢ జిల్లాలోని మంగాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఒకదానిని మరొకటి ఢీ కొన్నాయి. రెండు వేగంగా వచ్చి ఢీ కొన్నట్లు తెలుస్తోంది.
ఈ దుర్ఘటనలో 9మంది మరణించగా, మరో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాలుడిని స్థానికులు కాపాడారు.మృతుల్లో నలుగురు మహిళలున్నారు. గోరేగాం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.