కోల్‌కతా రేప్ కేసు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. RG కర్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్‌ను అత్యాచారం చేసి చంపిన ఘటన రాజకీయంగా పెను దుమారమే రేపింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఈ ఘటనకు సంఘీభావంగా ర్యాలీ చేసారు. బీజేపీ, NDA మిత్రపక్షాలు మాత్రం మమతా ప్రభుత్వం లో శాంతి భారతాలు కరువైనాయి అంటూ నిరశన జ్వాలలు రేపుతున్నారు.
ఇవన్నీ ఇలా ఉండగా తాజాగా బాధితురాలి తల్లిదండ్రులు కొన్ని పేర్లను సిబిఐ ముందు ఉంచారు. తమ కూతురికి జరిగిన ఘటనలో చాలామంది ఇంటర్న్, ఫీజిషన్ల హస్తం ఉన్నట్టు వారికీ అనుకుమానం ఉందని కొంతమంది పేర్లు కూడా అధికారులకు అప్పగించారు. సందేహిత వైద్యులు మరియు ఇంటర్న్‌ల పేర్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయంపై నమ్మకం వ్యక్తం చేస్తూ, ఈ కేసులో నిజమైన నిందితులు చట్టానికి అప్పగించబడాలని కోరుతున్నారు. వారి నేరస్థులను సత్వరంగా పట్టుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాలని వారు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. బాధితురాలి కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. కోల్‌కతా పోలీస్ శాఖ కూడా ఈ కేసును పెద్ద పటున విచారిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మల్లి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. గత 24 గంటలుగా దేశం లో ఉన్న మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు తమ విధులను బహిష్కరించి ఈ ఘటనకు సాంఘీభావం తెలుపుతున్నారు