»Ishant Sharma And His Wife Pratima Singh Expecting Birth Of Their First Child
Ishant Sharma: తండ్రి కాబోతున్న ఇషాంత్ శర్మ.. ఫోటో వైరల్
మిండియా ఫాస్ట్ బౌలర్ తండ్రి కాబోతున్నాడన్న వార్త వైరల్ గా మారింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాన్ కిషన్ భార్య ప్రతిమా సింగ్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. తాజాగా ఆమెకు సీమంతం నిర్వహించారు.
Ishant Sharma: భారత క్రికెట్ జట్టు ఆటగాడు ఇషాంత్ శర్మ తండ్రి కాబోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఇషాంత్‌తో పాటు అతని భార్య ప్రతిమా సింగ్ కూడా కనిపిస్తారు. ఇషాంత్ భార్య ప్రతిమ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. ఇషాంత్ శర్మ, ప్రతిమ ఇంట్లో ఒక ఫంక్షన్ నిర్వహించారు. ఇందులో ఆయన సన్నిహితులు పాల్గొన్నారు. ప్రతిమ ఈ వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. త్వరలోనే మా ఢిల్లీ క్యాపిటల్స్ లోకి ఓ కొత్త వ్యక్తి చేరబోతున్నారు అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.
మరో క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే తండ్రైన విషయం తెలిసిందే. తాజాగా మరో టీమిండియా ఫాస్ట్ బౌలర్ తండ్రి కాబోతున్నాడన్న వార్త వైరల్ గా మారింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాన్ కిషన్ భార్య ప్రతిమా సింగ్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. తాజాగా ఆమెకు సీమంతం నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో సీమంతం వేడుకును నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఢిల్లీ క్యాపిటల్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. చాలా మంది అభిమానులు ప్రతిమ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను లైక్ చేస్తున్నారు. కామెంట్ బాక్స్‌లో ఆమెకు అభినందనలు కూడా తెలిపారు.
టీమ్ ఇండియా అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ఇషాంత్ శర్మ చేరిపోయాడు. భారత్ తరఫున 105 టెస్టు మ్యాచ్‌లు ఆడి 311 వికెట్లు తీశాడు. ఈ కాలంలో ఇషాంత్ 11 సార్లు ఐదు వికెట్లు తీశాడు. ఒక ఇన్నింగ్స్‌లో 74 పరుగులకు 7 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన. ఇషాంత్ 80 వన్డేల్లో 115 వికెట్లు తీశాడు. 14 టీ20 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు తీశాడు.