How about the milky beauty song from Bhola Shankar.
Milky Beauty: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన భోళా శంకర్(BholaShankar) సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబు అవుతున్నాడు. వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాదిని బ్లాక్ బస్టర్ హిట్ ప్రారంభించిన ఆయన, ఇప్పుడు ఈ భోళా శంకర్ తో మరో హిట్ అందుకోవాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. తాజగా ఈ చిత్రం నుంచి మిల్కీ బ్యూటీ ఫుల్ సాంగ్ వచ్చేసింది.
ఈ మూవీలో చిరు సరసన ఈ మూవీలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాటలో చిరు చాలా స్టైలిష్ గా కనపడగా, తమన్నా చాలా హాట్ గా కనిపించింది. మిల్కీ బ్యూటీ .. నువ్వే నా స్వీటీ అంటూ ఈ పాట సాగుతోంది. పంజాబి బ్యాండ్ మ్యూజిక్ తో పాటను ప్రారంభించి నెమ్మదిగా వెస్టన్ కు బీట్ మార్చారు సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ . ఇక క్యాచీ పదాలతో హమ్ చేసుకోవడానికి అనువుగా ఉండేలా చక్కగా రాశారు తెలుగు లిరిక్ రైట్ రామజోగయ్య శాస్త్రి. శేఖర్ మాస్టర్ స్టెప్లతో చిరు గ్రేస్ మరోసారి చూపించారు. ఫారెన్ లో మంచు ప్రాంతంలో చిత్రీకరించారు. లొకేషన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక చిరు డ్యాన్స్ ఎలా వేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమన్నా కూడా మంచి డ్యాన్సరే కావడంతో, చిరుతో సమానంగా స్టెప్పులు వేసి అదరగొట్టింది.
మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చిరుకి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఆగస్టు 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీని తరువాత మెగాస్టార్ పెద్ద కూతురు స్థాపించిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ మూవీ చేయనున్నారు. ఈ మూవీకి బంగార్రాజు ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు.