రైతుల ఆదాయం, పంట దిగుబడి పెంచడమే లక్ష్యంగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. 25 పంటలకు సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ 184 మెరుగైన వంగడాలను ప్రారంభించనున్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) శాస్త్రవేత్తలు వీటిని అభివృద్ధి చేశారు. ఈ కొత్త రకాలు చీడపీడలను తట్టుకుని, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని అందిస్తాయని అధికారులు తెలిపారు.