AP: కూటమి ప్రభుత్వం సృష్టించిన విపత్తు ఇది అని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘నేలకొరిగిన పంట తిరిగి నిలబడ్డం కష్టమయ్యే పరిస్థితి. దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి’ అని వెల్లడించారు.