AP: అసెంబ్లీలో మహిళా సంరక్షణ కార్యదర్శులపై చర్చ జరిగింది. వారి విధులపై క్లారిటీ ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కోరగా.. హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు 5 డిపార్ట్మెంట్లకు జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. వారు పోలిసులా?సంరక్షుకులా? అనేది తేలాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ చర్యల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. ఏం చేయాలనే దానిపై సలహాలు ఇవ్వాలని హోంమంత్రి కోరారు.