»Father Travels With Son Dead Body In Rtc Bus At West Bengal
Kolkata : అంబులెన్స్ కు డబ్బుల్లేక బిడ్డ శవంతో 200కి.మీ బస్సులో వెళ్లిన తండ్రి
సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్న ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మానవుడి కనీస అవసరాలు తీరడంలేదు. నేడు వైద్యం ఒక వ్యాపారంగా మారిపోయింది. ఏదైనా అనారోగ్యం వస్తే పైస ఉంటేనే ప్రాణాలు నిలిచే పరిస్థితి ఏర్పడింది. పైసలేనోళ్లు సర్కార్ దవాఖానాకు పోతే అక్కడ కూడా అవినీతి జలగలు డబ్బుల కోసం పీల్చుకుతింటున్నాయి.
Kolkata : సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్న ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మానవుడి కనీస అవసరాలు తీరడంలేదు. నేడు వైద్యం(medical) ఒక వ్యాపారం(Business)గా మారిపోయింది. ఏదైనా అనారోగ్యం వస్తే పైస ఉంటేనే ప్రాణాలు నిలిచే పరిస్థితి ఏర్పడింది. పైసలేనోళ్లు సర్కార్ దవాఖానా(Government Hospital)కు పోతే అక్కడ కూడా అవినీతి జలగలు డబ్బుల కోసం పీల్చుకుతింటున్నాయి. దీంతో నిరుపేదకు అనారోగ్యం వస్తే చావే తప్పా వేరే దిక్కులేకుండా పోయింది. ఇక్కడ విశేషం ఏంటంటే చచ్చిన శవాలపై కూడా పైసలుఏరుకునే చిల్లర వ్యక్తులున్నారు. ఈ క్రమంలోనే ఓ నిరుపేద తండ్రి తన ఐదునెలల కొడుకు చనిపోవడంతో దు:ఖాన్ని అణుచుకుని అంబులెన్స్ కు డబ్బులిచ్చుకోలేక శవాన్ని బ్యాగులో పెట్టుకుని 200కి.మీ ప్రయాణించాడు. ఈ హృదయవిదారక ఘటన పశ్చిమ బెంగాల్(West Bengal) లో వెలుగుచూసింది.
ఉత్తర్ దినాజపూర్ జిల్లా కలియాగంజ్ ప్రాంతానికి చెందిన ఆసిమ్ దేవశర్మ రోజూ కూలీపనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తన భార్య కవల (ఆడ, మగ) పిల్లలకు జన్మనిచ్చింది. ఐదునెలల వయసు రాగానే బిడ్డలిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో తల్లిదండ్రులు సిలిగురి(Siliguri)లోని ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం ఆడ బిడ్డ ఆరోగ్యం మెరుగుపడటంతో తల్లీ బిడ్డ ఇంటికి వెళ్లిపోయారు. తండ్రి దేవశర్మ మగబిడ్డను తీసుకుని హాస్పిటల్లోనే ఉన్నాడు. శనివారం చికిత్స పొందుతూ కొడుకు కన్నుమూశాడు. దీంతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు దేవశర్మ అంబులెన్స్ ను ఆశ్రయించాడు. అంబులెన్స్(Ambulance) డ్రైవర్లు రూ.8వేలు డిమాండ్ చేశారు. ఇప్పటికే వైద్యం కోసం తెచ్చిన రూ.16వేలు ఖర్చవడంలో అంబులెన్స్ కు డబ్బులు లేవు. దీంతో చేసేదేమీ లేక బిడ్డ మృతదేహాన్ని తీసుకుని హాస్పిటల్ బయటకు వచ్చేశాడు.
కన్నీటిని దిగమింగుకుంటూ ఓ బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని దాచి సాధారణ ప్రయాణికుడిలా 200 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించాడు. ఇలా కలియాగంజ్ కు చేరుకున్నాక తక్కువ డబ్బులకు అంబులెన్స్ మాట్లాడుకుని మృతదేహాన్ని అందులో స్వగ్రామానికి తరలించాడు. బిడ్డ మృతిచెందడంతో ఆ తల్లి మనోవేదన అనుభవిస్తోంది. ఇలా కన్నబిడ్డ మృతదేహాన్ని తండ్రి గుట్టుగా బస్సులో తరలించిన ఘటన పశ్చిమ బెంగాల్ లో రాజకీయ దుమారం రేపింది. టీఎంసి పాలనలో రాష్ట్రంలోని నిరుపేదల పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చిని బిజెపి నేత సువేందు అధికారి మండిపడ్డారు.