తెలంగాణలో కులగణన మాట నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులను రాహుల్ గాంధీ తెలుసుకున్నారన్నారు. అతని మాట ప్రకారం రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. దేశవ్యాప్తంగా కేంద్రం కులగణన చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు గాంధీ పరివార్ ఉంది. రాహుల్కు అండగా మేమున్నామన్నారు.