గతంలో ఓ విమానంలో ప్రయాణించే సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథన్ ఓ కేసు విచారణ సందర్భంగా వివరించారు. ఆ విమానంలో ప్రయాణించే సమయంలో మద్యం తాగిన ఓ వ్యక్తి విమానం వాష్‌రూంలోకి వెళ్లి నిద్రపోయాడని జస్టిస్ తెలిపారు. అరగంటకుపైగా వేచి చూసిన తర్వాత.. తలుపు తెరిచి అతడిని బయటకు తీసుకురావాల్సిందిగా వేరే ప్రయాణికుడిని విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.