తమ కుమార్తె మృతికి న్యాయం చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో కలిసి ఆర్జీ కర్ బాధితురాలి తల్లిదండ్రులు బెంగాల్ అసెంబ్లీకి వెళ్లారు. తమ బిడ్డ దూరమైనప్పటినుంచి పడుతున్న వేదనను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబరు 10న రాజ్‌భవన్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపడతామని సువేందు అధికారి వెల్లడించారు.