కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వ అంశం తమ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని తాజాగా అలహాబాద్ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. రాహుల్ బ్రిటన్ పౌరుడని, ఈ నేపథ్యంలో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై తన స్పందన తెలపాలని కోర్టు.. కేంద్రాన్ని కోరగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.