AP: CID మాజీ అదనపు ఎస్సీ విజయ్ పాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడుగా ఉన్న విజయ్ పాల్‌ను ఉదయం నుంచి ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు. గత విచారణలోనూ తెలియదు, గుర్తులేదు అంటూ పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. సుప్రీం కోర్టు అతని ముందస్తు బెయిల్ పిటిషన్ తిరష్కరించడంతో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.