TG: ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ‘బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై బీజేపీకి ఎలాంటి నమ్మకం, విశ్వాసం లేవు. దేశంలో రాజ్యంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలుస్తూ బీజేపీ రాజ్యాంగాన్ని కూనీ చేసింది. రాజ్యాంగానికి, భారతీయ సంస్కృతికి ఎలాంటి సంబంధం లేదని గతంతో చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులు అన్నారు. బీజేపీకి రాజ్యాంగంపై ఎలాంటి నమ్మకం లేదు’ అని పేర్కొన్నారు.