JGL: మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటింటి సర్వే డేటా ఎంట్రీని జిల్లా కలెక్టర్ బీ సత్య ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ చేస్తున్న ఆపరేటర్లను పరిశీలించారు. అనంతరం డేటా ఎంట్రీ తప్పులు లేకుండా పకడ్బందీగా ఎంటర్ చేయాలన్నారు.