మహారాష్ట్ర ‘సీఎం’ ఎంపిక మరింత ఆలస్యమయ్యేటట్లు కనిపిస్తోంది. శాఖల కేటాయింపు, కీలక పదవులపై సయోధ్య కుదిరేవరకు సీఎం పేరు ప్రకటన వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఆపద్ధర్మ సీఎంగా ఏక్నాథ్ షిండేను కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు మహారాష్ట్రకు పరిశీలకులను పంపించే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం ఎవరనేదానిపై బుధవారం ఉదయం లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని శివసేన నేత సంజయ్ వెల్లడించారు.