యంగ్ బ్యూటీ రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు, తమిళ్, మలయాళీ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడుకి మెగా ఫ్యామిలీతో చాలా మెరుగైన సంబంధాలు ఉన్నాయి. మెగా కుటుంబంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా హాజరవుతుండటంతో మెగా హీరోతో ప్రేమలో ఉందని, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా మెగా ఫ్యామిలీలో పెళ్లి కానీ హీరోలు ఎవరు ఉన్నారని లెక్కలేసుకుంటున్నారు.