భారతదేశంలో మొదటిసారిగా క్రిస్మస్ కేక్ 1883లో కేరళలో తయారైంది. మాంబల్లి రాయల్ బిస్కెట్ ఫ్యాక్టరీలో వెస్టర్న్ బేకింగ్ పద్ధతులను ఉపయోగించి, భారతీయుల రుచికి సరిపోయే ‘ప్లమ్ కేక్’ను తయారు చేశారు. యూరోపియన్ రెసిపీకి భారతీయ స్పర్శను కలిపి సృష్టించిన ఈ కేక్ ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందింది. కేరళలో ప్రారంభమైన ఈ కేక్ సంస్కృతి, భారత్లోని క్రిస్మస్ వేడుకలలో ముఖ్య భాగంగా మారింది.