AP: విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంతో పోల్చితే విద్యుత్ కొనుగోళ్లు 60 శాతం తగ్గాయని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి సరిపడా జరగడంతో కొనుగోళ్లు తగ్గాయని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.