NTR: ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి, దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకోనున్న నేపథ్యంలో ఆలయంతో పాటు ముఖ్య ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డా.జి. లక్ష్మీశ మంగళవారం తెలిపారు. రెవెన్యూ, పోలీస్, వీఎంసీ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులకు ఏర్పాట్లపై మార్గనిర్దేశం చేశారు.