VZM: లీగల్ మెట్రాలజి అధికారులు విజయనగరం రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అమ్మకం ధర కంటే అధికంగా విక్రయించడం, తూనిక యంత్రంనకు సిళ్లు లేకపోవడం గుర్తించి మొత్తం 8 కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. ముద్రించన ధర కంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.