TG: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి తాజ్ డెక్కన్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. డిన్నర్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రజాపాలన విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ డిన్నర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.