ఇటీవల గోవాలో తన ప్రియుడు ఆంటోనీతో నటి కీర్తి సురేష్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఈ వేడుకకు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హాజరై సందడి చేశారు. తాజాగా కీర్తి.. విజయ్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘డీమ్ ఐకాన్ ఆశీర్వదించిన క్షణాలు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.