AP: బయో డైవర్సిటీ పార్కు కింద వర్సిటీ తయారు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో మొక్క నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నెట్ జీరో కార్యక్రమం కింద కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ఎలక్ట్రిక్ స్టవ్స్, పీఎన్జీ గ్యాస్ పైపులైన్లు వినియోగించుకోవాలి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేలా వర్సిటీ వాతావరణాన్ని మార్చాలి’ అని పేర్కొన్నారు.