»Devotee Offering A Sari Woven With Gold In A Matchbox To Goddess Rajeshwari
Vemulawada: అమ్మవారికి భక్తుడి అరుదైన కానుక.. అగ్గిపెట్టెలో బంగారంతో నేసిన చీర
రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లాకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్(Nalla Vijay) రెండు గ్రాముల బంగారంతో చీర(Gold Saree)ను నేసి అమ్మవారికి కానుకగా ఇచ్చాడు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ చీర అగ్గిపెట్టె(Match Boxలో ఇమిడేలా తయారు చేశాడు.
Vemulawada: రాష్ట్రంలోని ప్రముఖ శైవాలయం వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి భక్తుడు అరుదైన కానుక సమర్పించుకున్నాడు. రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లాకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్(Nalla Vijay) రెండు గ్రాముల బంగారంతో చీర(Gold Saree)ను నేసి అమ్మవారికి కానుకగా ఇచ్చాడు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ చీర అగ్గిపెట్టె(Match Boxలో ఇమిడేలా తయారు చేశాడు. నేత కార్మికుడు విజయ్ తరచుగా అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి.. రాష్ట్రంలోని పలు ఆలయాల్లో కొలువుదీరిన అమ్మవార్లకు కానుకగా ఇస్తూ ఉంటారు. ఇటీవలే విజయవాడ కనకదుర్గమ్మకు కూడా ఇలాంటి కానుకే సమర్పించాడు. తాజాగా వేములవాడ రాజేశ్వరి దేవి(Vemulawada Rajeshwari Devi)కి చీరను అందించారు. రాజన్న సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ వారి వారసత్వంగా వస్తున్న నేత పనినే జీవనోపాధిగా చేసుకున్నాడు.
తన తండ్రి గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసి ఆలయాలు, ప్రజాప్రతినిధులకు బహుమతిగా ఇచ్చేవాడు. తండ్రి వారసత్వాన్ని తానూ కొనసాగించాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే తాను కూడా ఈ చీరలను ఆలయాలకు బహుకరిస్తున్నట్లు నల్ల విజయ్ చెప్పాడు. ఆ క్రమంలోనే రెండు గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేశానని వివరించాడు. తాను గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో.. తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ(Vijayawada kanakadurga) ఆలయంలో బంగారంతో నేసిన చీరలను అమ్మవార్లకు బహుకరించినట్టు తెలిపారు. తాజాగా నేసిన చీరను వేములవాడ ఆలయంలోని అమ్మవారికి బహుకరిస్తున్నట్లు తెలిపారు.