హీరో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. పరిస్థితుల దృష్ట్యా దాన్ని లంచ్ మోషన్ పిటిషన్‌గా విచారించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోరారు. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం రెండున్నరకు విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టయ్యారు.