SKLM: మెలియాపుట్టి మండలం కరజాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో నేటి నుండి 24వ తేదీ వరకు విద్యాశాఖ పిలుపు మేరకు వినియోగదారుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వినియోగదారుల క్లబ్ మాస్టర్ ట్రైనర్ ఎల్.వెంకటాచలం తెలిపారు. గురువారం విద్యార్థులచే వినియోగదారుల భాగస్వామ్యం గురించి వివరిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. క్లబ్బు విద్యార్థులకు ఎగ్జామ్ రమణమూర్తి టీ షర్టులు అందజేశారు.